బుడి బుడి అడుగుల బుడత స్వచ్ఛ స్ఫూర్తి ప్రదాత!

జన్నత్‌ వయసు ఏడేళ్లు. ఈ వయసు పిల్లలు ఏం చేస్తారు? హాయిగా ఆడుకుంటారు. తెగ అల్లరి చేస్తారు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. వస్తువులన్నీ చిందరవందర చేస్తారు. మరి జన్నత్‌ ఏం చేస్తోందో తెలుసా..? దాల్‌ సరస్సును శుభ్రం చేస్తోంది.. అదీ రెండేళ్లుగా...అది జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు. ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన సరస్సుల్లో ఇదీ ఒకటి. లాక్‌డౌన్‌కు ముందు వరకు...

Updated : 01 Jul 2020 00:26 IST

జన్నత్‌ వయసు ఏడేళ్లు. ఈ వయసు పిల్లలు ఏం చేస్తారు? హాయిగా ఆడుకుంటారు. తెగ అల్లరి చేస్తారు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. వస్తువులన్నీ చిందరవందర చేస్తారు. మరి జన్నత్‌ ఏం చేస్తోందో తెలుసా..? దాల్‌ సరస్సును శుభ్రం చేస్తోంది.. అదీ రెండేళ్లుగా...

ది జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు. ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన సరస్సుల్లో ఇదీ ఒకటి. లాక్‌డౌన్‌కు ముందు వరకు ఇది నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉండేది. దీనిలో చెత్తాచెదారమూ అదే స్థాయిలో పేరుకుపోయి ఉండేది. నాచు, కలుపూ అల్లుకుపోయి కనిపించేది. అందమైన సరస్సు అందవిహీనంగా మారడం చిన్నారి జన్నత్‌ను కదిలించింది. మొట్టమొదట ఆమె తనకు అయిదేళ్ల వయసున్నప్పుడు 2018లో తన తండ్రి సాయంతో సరస్సును శుభ్రం చేయడం ప్రారంభించింది. అప్పట్లో ఆమె తన తండ్రితో కలిసి దాల్‌ సరస్సును శుభ్రం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను ట్విట్టర్‌లో ప్రశంసించారు. తాజాగా ఈ చిన్నారి గురించి హైదరాబాద్‌కు చెందిన ఓ స్కూలు టెక్ట్స్‌బుక్‌లో ప్రచురించారని తెలిసి ఆమె తండ్రి తారిక్‌ అహ్మద్‌ చాలా ఆనందిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని