స్నేహానికి... చిహ్నం!!

హాయ్‌ నేస్తాలూ.. ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మనాన్న, తోడబుట్టినవాళ్ల తర్వాత అంతటి విలువనిచ్చేది స్నేహబంధానికే కదా! మరి ఇవాళ స్నేహితుల పండగ... మనమేమో పాత మిత్రుల్ని కలవడం, కొత్త స్నేహాలు కలుపుకోడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకుని, సంబరాలు చేసుకోడం.. ఒకటే హడావిడి చేసేస్తాం కదా! అసలు ఇది ఎప్పుడు మొదలైంది. దీని కథా కమామీషు ఏంటో చూద్దాం...

Published : 02 Aug 2020 02:16 IST

హాయ్‌ నేస్తాలూ.. ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మనాన్న, తోడబుట్టినవాళ్ల తర్వాత అంతటి విలువనిచ్చేది స్నేహబంధానికే కదా! మరి ఇవాళ స్నేహితుల పండగ... మనమేమో పాత మిత్రుల్ని కలవడం, కొత్త స్నేహాలు కలుపుకోడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకుని, సంబరాలు చేసుకోడం.. ఒకటే హడావిడి చేసేస్తాం కదా! అసలు ఇది ఎప్పుడు మొదలైంది. దీని కథా కమామీషు ఏంటో చూద్దాం...


అలా మొదలైంది!
1930లలో హాల్‌మార్క్‌ గ్రీటింగ్స్‌ యజమాని ‘జాయిస్‌ హాల్‌’ సన్నిహితుల్ని కలుసుకునే రోజంటూ జూన్‌ 30ని ప్రకటించాడు. కానీ ఈ ప్రకటన వెనక వ్యాపారకోణం ఉందని కొన్నాళ్లకు అంతా తోసిపుచ్చారు. 1958లో పరాగ్వేకి చెందిన ‘డాక్టర్‌ రామోన్‌ ఆర్టేమియా’ పరాగ్వేలోని ప్యూర్టో పినాస్కో పట్టణంలో స్నేహితులందరికీ విందు ఇచ్చాడు. ఆ రోజు జులై 30. ఎంతో ఆనందంగా గడిచిన ఆ రోజును మరచిపోతే ఎలా! అందుకే ఏటా జులై 30న స్నేహితులందరం కలుసుకుందామని కోరాడు. అప్పట్నుంచి పరాగ్వేలో జాతి, రంగు, కుల, మత భేదంలేకుండా ఫ్రెండ్షిప్‌ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.


విన్నీ ఫూ స్నేహానికి గుర్తుగా
ఇంగ్లిష్‌ రచయిత ‘ఎ.ఎ.మిల్నే సృష్టించిన కార్టూన్‌ పాత్ర ‘విన్నీ ది ఫూ’. విన్నీ ఫూ, టెడ్డీబేర్‌ల స్నేహానికి గుర్తుగా ఐక్యరాజ్యసమితి 1998లో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. దీనికి కారకులు ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రెటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ భార్య ‘నానే అన్నన్‌’. అదిగో అలా స్నేహానికి గుర్తుగా టెడ్డీబేర్‌ను ఇచ్చుకోవడం మొదలైంది.

తిఎప్పుడైనా స్నేహం కోసమే!
1935లో యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల రోజుగా ప్రకటించింది. మనం దేశం దీన్నే అనుసరించింది. కానీ కొన్ని దేశాలు వాటికి నచ్చిన తేదీల్లో.. మసాచుసెట్స్‌, ఓహియో జూన 30, బ్రెజిల్‌ ఏప్రిల్‌ 18, అర్జెంటినా, ఈక్వెడార్‌, ఉరుగ్వే జులై 20వ తేదిన నిర్వహిస్తారు. పెరూ జులై మొదటి శనివారం, పాకిస్తాన్‌ జులై 30న చేసుకుంటాయి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని