రక్షణనిచ్చే బంధం
రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్షాబంధనాన్ని కడుతుంది. సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు అండగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నమైన ఈ వేడుక శ్రావణమాసంలో పౌర్ణమిరోజు జరుపుకుంటారు. ఈ తీయని వేడుక ఎలా మొదలైందో తెలిపే కథలు బోలెడున్నాయి..
రాఖీ, రక్షాబంధన్, రాఖీపౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి. అంటే జులై-ఆగస్టు నెలల్లో వస్తుంది. మొదట్లో ఈ వేడుకని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు చెందిన భారతీయులే జరుపుకునేవారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలూ చేసుకునే పండగైంది. పురాణాలు, చరిత్రలో కూడా రక్షాబంధన విశేషాలున్నాయి.
ఇంద్రుణ్ని విజేతను చేసిన రక్ష
దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతలరాజు ఇంద్రుడు ఓటమిపాలవుతాడు. చావుభయంతో ఉన్న భర్త ఇంద్రుడికి శచీదేవి పూజలో ఉంచిన రక్షను కడుతుంది. తర్వాత యుద్ధానికి వెళ్లిన ఇంద్రుడు ఘన విజయం సాధించి ముల్లోకాలనూ ఏలుతాడు. అలా శచీదేవి వల్ల ప్రారంభమైన రక్షాబంధన ఆచారం.. అన్నాచెల్లెళ్ల పండగగా మారి నేటికీ కొనసాగుతోంది.
బలి చక్రవర్తి బాధ్యతకు గుర్తు
ఒకానొక సందర్భంలో బలి చక్రవర్తి కోరిక మేరకు విష్ణుమూర్తి పాతాళంలో ఉండిపోతాడు. లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షను కట్టి తన భర్తను ఇమ్మని వేడుకుంటుంది. లక్ష్మిని చెల్లెలిగా భావించిన బలి.. విష్ణువుని లక్ష్మికి అప్పగిస్తాడు. ఈ కథ చెల్లెలి కోరికను తీర్చే అన్న బాధ్యతకు నిదర్శనం.
ఇతిహాసాల్లో రక్షాబంధం
శిశుపాలుణ్ని శిక్షించేందుకు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుని చూపుడు వేలు తెగి రక్తం కారుతుంది. వెంటనే ద్రౌపది తన చీరకొంగు చించి కట్టుకడుతుంది. అందుకు కృతజ్ఞతతో కృష్ణుడు ఎల్లవేళలా నీకు అండగా ఉంటానని మాటిస్తాడు. అన్నట్టే.. దుశ్శాశనుడు ఆమె చీరను లాగినప్పుడు చీరలిచ్చి ఆదుకుంటాడు. ఈ కథ చెల్లెని పట్ల అన్న బాధ్యతను గుర్తు చేస్తుంది.
మతాలకతీతమైన బంధం
గ్రీకు యువరాజు అలెగ్జాండర్ భార్య రోక్సానా. ఆమె తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించేది. అలెగ్జాండర్ 320లో భారతదేశంపై దండెత్తాడు. పురుషోత్తముడు అలెగ్జాండర్‌ని ఎదుర్కోడానికి సిద్ధపడతాడు. అతని పరాక్రమం గురించి తెలిసిన రోక్సానా రాఖీకట్టి, పతి భిక్ష పెట్టమంటుంది. పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ఓడించినా, రోక్సానా కోరిందని చంపకుండా వదిలేస్తాడు. ఈ ఉదంతం అన్నాచెల్లెళ్ల అనురాగానికి చిహ్నంగా తోస్తుంది.
మరెన్నో బంధాలు
ఇంకా.. మొఘలాయిలు ఏలుతున్న సమయమది. చిత్తోడ్ రాజ్యానికి చెందిన కర్నావతి అనే రాణి మొగల్ చక్రవర్తి హుమాయూన్‌కి రాఖీని పంపి సంధి కోరిందని చరిత్ర చెబుతోంది.
1905లో బెంగాల్ విభజన సందర్భంలో విశ్వకవి రవీంద్రనాథ్‌టాగోర్ హిందూ ముస్ల్లింలకు పిలుపునిచ్చారు. వారి ఐక్యతని చాటుతూ ముస్లిం స్త్రీలు, ఎందరో హిందూ సోదరులకు రక్షాబంధనాన్ని కట్టారు.
ఈ వేడుక అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనురాగానికి అద్దం పడుతుంది. ఈ పండగను నేపాల్, థాయిలాండ్, కెనడా, బ్రిటన్ దేశాలలో కూడా జరుపుకుంటారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP minister suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత
-
Movies News
Kiara Advani: ప్రేమ ముఖ్యం.. సారీ చెప్పడానికి ఇబ్బందెందుకు: కియారా అడ్వాణీ
-
Politics News
Maharashtra Crisis: ‘శివసైనికులు గనక బయటకొస్తే..’ సంజయ్ రౌత్ ఘాటు హెచ్చరిక
-
India News
Droupadi Murmu: ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు
-
Movies News
Nikhil: లైవ్ ఈవెంట్లో అభిమానికి నిఖిల్ సూపర్ గిఫ్ట్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్