Published : 20 Aug 2019 00:37 IST
గాడ్జిల్లాలతో తిరిగాయ్... మనతో చేరాయ్!
ఈ రోజు దోమది...అర్థం కాలేదా?
ఇవాళ ‘వరల్డ్ మస్కిటో డే’...అసలు దీనికీ ఓ రోజు ఎందుకు? ఆడ దోమలే మనల్ని కుడతాయెందుకు?
కార్బన్ డయాక్సైడ్ వీటికి ఇష్టమట. అదెందుకు?
ఇంకా బోలెడు సంగతులు...ఇవిగో!
* మనం ఆంగ్లంలో దోమల్ని మస్కిటోస్ అని పిలుస్తాం కదా. అది స్పానిష్ పదం. ఆ మాటకు అర్థం ‘ఎగిరే చిన్నజీవి’ అని. వీటిని కొన్ని దేశాల్లో మోజీస్ అనీ పిలుస్తుంటారు. | * ఆడ, మగ దోమలు రెండూ మొక్కలు, పండ్లు, పుప్పొడిలాంటి వాటిపై నుంచే తమ ఆహారాన్ని సేకరిస్తాయి. మామూలుగా ఇవే వీటి ప్రధాన ఆహారం. |
* మనుషులు, మిగిలిన జీవుల్ని మాత్రం ఆడ దోమలే కుడతాయి. ఎందుకో తెల్సా? అవి గుడ్లను ఉత్పత్తి చెయ్యడానికి మన రక్తంలో ఉండే ఓ ప్రొటీన్ వీటికి అవసరం. రక్తాన్ని బొజ్జ నిండా నింపేసుకున్నాక ఇవి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో వాటిలో గుడ్లు అభివృద్ధి చెందుతాయి. | * మనుషుల నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ వాసనను ఇవి పసిగట్టగలవట. దాన్ని వెతుక్కుంటూనే ఇవి మన దగ్గరకొచ్చేస్తాయి. కుట్టిపడేస్తాయి. |
* వీటి పరిమాణానికి మూడింతల రక్తాన్ని బొజ్జల్లో నింపుకోగలవు. రక్తం తాగే సమయంలో వీటి శరీరం ఉబ్బినట్లు అవుతుందన్నమాట. | * ఆడదోమ దాని జీవిత కాలంలో మూడు సార్లు గుడ్లు పెడుతుంది. ఒక్కోసారీ మూడొందల వరకూ గుడ్లు పెట్టేస్తుంది. ఆ గుడ్ల సమూహాన్ని ఆంగ్లంలో రేఫ్ట్ అంటారు. కదలకుండే ఉండే నీరున్న ప్రాంతాల్లో వీటిని పెట్టేస్తాయివి. అందుకనే వర్షాకాలం మనకు ఎక్కువ దోమలు వచ్చేస్తాయి. |
* గుడ్ల నుంచి బయటకొచ్చిన పిల్లల్ని లార్వాలంటాంగా. అవి పది రోజుల పాటు నీటిలోనే ఉంటాయి. నీటిలోని కుళ్లిన చిన్న చిన్నఆకుల్లాంటివాటిని తిని, పెరిగి ప్యూపాలుగా మారతాయి. మరికొన్ని రోజులకు దోమలుగా వచ్చేస్తాయి. | * దోమల్లో 3,500 వరకూ రకాలున్నాయి. |
* ఇవి వేగంగా, ఎగరలేవు. గంటకు దాదాపు రెండు కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించ గలవు. | * అంతెత్తున ఉండే హిమాలయాల మీదా ఇవున్నాయట. |
* గాడ్జిల్లాలున్న జురాసిక్ పీరియడ్ నాటివివి. అప్పటి నుంచీ హాయిగా బతికేస్తున్నాయి. | * వీటిని ‘డెడ్‌లీయెస్ట్ యానిమల్ ఇన్ ద వరల్డ్’ అని అంటారు. అంటే అతి ప్రమాదకరమైన ప్రాణి. ఇవి ఏటా పది లక్షల మందిని మలేరియా బారిన పడేస్తున్నాయి. |
* వీటికి ఆరు కాళ్లుంటాయి. జీవితకాలం రెండు నెలలు. | * మన నుంచే కాదు పక్షులు, ఇతర జంతువుల నుంచీ రక్తాన్ని తీసుకుంటాయివి. |
* వీటికి పళ్లు ఉండవు. నోటి నుంచి ఉండే తొండంలాంటి భాగంతోనే మనల్ని కుట్టేస్తాయి. |
ఈరోజు ఎందుకంటే? * 1897నుంచి ‘వరల్డ్ మస్కిటో డే’ను జరుపుతున్నారు. * రొనాల్డ్‌రాస్ మలేరియాకు, దోమలకు ఉన్న సంబంధాన్ని కనుగొనడానికి గుర్తుగానే ఈ రోజును జరుపుతారు. * ఈ రోజున మలేరియా, దోమల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. * పేదవారికి దోమ తెరలు పంపకంలాంటివీ చేస్తుంటారు. |
email: hb.eenadu@gmail.com
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!