మంటల రంగుల్లోఆ తేడాలెందుకు?

మండేటప్పుడు పసుపు, నారింజ, ఎరుపులాంటి వివిధ రంగులు ఎందుకు...

Published : 05 Mar 2020 00:10 IST

ఎందుకు ఏమిటి ఎలా?

ప్రశ్న: మండేటప్పుడు పసుపు, నారింజ, ఎరుపులాంటి వివిధ రంగులు ఎందుకు వస్తాయి?

- కె. అన్వి, హైదరాబాద్‌

రకరకాలైన రసాయనిక ధాతువులున్న కర్రలు మండేప్పుడు వివిధ రంగులు రావడం సహజం.

మంట వల్ల ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలో కర్రలు, బొగ్గులు ఇతర ఇంధనాల్లో ఉన్న పరమాణువులు ఉత్తేజమవుతాయి.

ఉత్తేజం చెందిన పరమాణువులు తిరిగి తమ పూర్వశక్తి స్థాయికి వచ్చేప్పుడు తీసుకున్న అధిక శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తాయి.

ఇలా ఏ ఉత్తేజిత స్థాయికి వెళ్లాయి? ఏ విధమైన పూర్వస్థాయి? అన్న విషయం ఆయా పరమాణువుల తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి విడుదలయ్యే కాంతి రంగులు కూడా వేర్వేరుగా ఉంటాయి.

సాధారణంగా సోడియం వంటి మూలకాలుంటే పసుపు రంగు, పొటాషియం ఉంటే ఊదారంగు, కాల్షియం ఉంటే ముదురు ఎరుపు లేదా నారింజ రంగు ఉండటం సహజం.

ఒక్కోసారి కర్బన శకలాలైనా అవి ఉన్న ఉష్ణోగ్రతను బట్టి వేర్వేరు రంగులున్న కాంతుల్ని విడుదల చేస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు