రోజుకో పద్యం

కమలములు నీట బాసినఁగమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్‌దమ దమ నెలవులు దప్పినఁ

Published : 07 May 2020 01:10 IST

కమలములు నీట బాసినఁ

గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్‌

దమ దమ నెలవులు దప్పినఁ

దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

అంటే.. పద్మాలు నీళ్లల్లో ఉంటాయి. సూర్యుడు రాగానే విచ్చుకుంటాయి. పద్మాలూ, సూర్యుడూ మంచి మిత్రులు. కానీ పద్మాలను నీళ్లలోంచి బయటకు తెస్తే ఎండవేడికి మాడిపోతాయి. అందుకే ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. తమ స్థానాన్ని విడిచి పెడితే స్నేహితులే శత్రువులవుతారు.


ప్రాణదాతల్ని గౌరవిద్దాం...


నీడేది?

మొదటి బొమ్మ నీడను పట్టుకోండి


అంకెల దారిలో...

మీకు రెండోఎక్కం వచ్చు కదా! అయితే 2 నుంచి 40 వరకు వెళుతూ దారి కనిపెట్టేయండి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


జవాబులు: నీడేది: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని