రోజుకో పద్యం

చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు పామరుఁడుదగన్‌........

Published : 23 May 2020 00:12 IST

చీమలు పెట్టిన పుట్టలు

పాములకిరవైనయట్లు పామరుఁడుదగన్‌

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ!

అంటే.. చీమలు కష్టపడి పుట్టలు పెట్టుకుంటే పాములు అందులో చేరి నివాసముంటాయి. మూర్ఖుడు ఆశగా బంగారం, డబ్బు దాచిపెడితే అది చివరకు రాజుల దగ్గరికి చేరుతుంది.


పొడుపు కథలు

1. మనం మేల్కోగానే పడుకుంటుంది. మనం నిద్ర పోగానే మేల్కొంటుంది. ఏమిటది?

2. ముగ్గురు అన్నదమ్ములు రాత్రి, పగలు నడుస్తూనే ఉంటారు?


అంకెల ఆధారంగా రంగులు వేయండి

ఇక్కడ బొమ్మలో కొన్ని అంకెలున్నాయి. వాటి కింద ఆ అంకెలకు సంబంధించిన రంగులున్నాయి. వీటి ఆధారంగా రంగులు వేయండి.


కవలలేవి

వీటిలో ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ

ప్రకృతిని కాపాడుకుందాం


దారేది?


జవాబులు

పొడుపు కథలు: 1.చంద్రుడు 2.గడియారంలోని ముల్లులు

కవలలేవి : 2,4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని