Published : 08 Jun 2020 00:44 IST

గుండెపోటు మనుషులకే వస్తుందా?

 

-జి.షర్మిల, పదోతరగతి, అక్షర స్కూలు, రాజోలు

గుండెపోటు మనుషులతో పాటు కొన్ని జంతువులకూ వస్తుంది. కానీ ఇతర జీవుల్లో రావడం చాలా అరుదు. రక్తనాళాలు, ధమనులకు వచ్చే వ్యాధి లేదా ధమనుల రక్త ప్రవాహంలో ఆటంకం రావడం కారణంగా మనుషుల్లో గుండెపోటు వస్తుంది. కుక్కలు, పిల్లులు వంటివాటిలో ఈ రకమైన సమస్యల వల్ల గుండెపోటు రాదు. కానీ ఈ జంతువులకూ వేరే కారణాల వల్ల గుండె జబ్బులు రావొచ్ఛు చింపాంజీల్లో గుండెపోట్లు వస్తాయి. కానీ వీటి విషయంలో కారణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. చింపాంజీలపై జరిగిన పరిశోధనల ఆధారంగా వాటి గుండె కండరాల్లోని జీవకణాలు నశించడంతో అకస్మాత్తుగా వాటికి మరణం సంభవిస్తోందని తెలిసింది. కానీ ఇలా ఎందుకు జరుగుతోందో కారణం తెలియలేదు.

మనిషి గుండెలో పైన రెండు గదులు, కింద రెండు గదులు ఉంటాయి. ఇవి రక్తాన్ని ఒక దిశలో పంపిస్తూ ఉంటాయి. కొన్ని జంతువుల్లోనూ గుండె నిర్మాణం ఇలానే ఉంటుంది. మరి కొన్ని జంతువుల్లో గుండెలో పైన ఒక గది, కింద మరో గది ఉండి.. రక్తాన్ని రెండు దిశల్లోనూ సరఫరా చేస్తూ ఉంటుంది. మనుషుల్లో ఒత్తిడి వల్ల ఎడ్రినలీన్‌, కార్టిసోన్‌ వంటి హార్మోన్లు రక్తం గడ్డ కట్టించేందుకు కారణం అవుతాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందని తాజా అధ్యయనాల వల్ల తెలుస్తోంది. ఒత్తిడి కారణంగా పిల్లుల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగి, రక్తపోటు అధికమై గుండెపోటు రావచ్ఛు కుక్కల విషయంలో గుండెలోని కండరాల గోడల్లోకి రక్తప్రవాహం ఆగిపోవడం వల్ల ప్రమాదం జరగవచ్ఛు.

-డాక్టర్‌ సి.వి. సర్వేశ్వరశర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్సు పరిషత్తు, అమలాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts