వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి?

ప్ర: మనుషులకు వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి?

Updated : 15 Jun 2020 06:14 IST

ప్ర: మనుషులకు వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి?

- బి.షణ్ముఖేశ్వరి, పదోతరగతి, జడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌, తణుకు

నిషి వయసు పెరుగుతుంటే వెంట్రుకల కుదుళ్లలో రంగును ఉత్పత్తి చేసే జీవకణాలు మెల్లిమెల్లిగా మరణిస్తూ ఉంటాయి. వీటి సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో కేశ కుదుళ్ల నుంచి బహిర్గతం అవుతున్న వెంట్రుకలకు తగినంత మెలనిన్‌ అందదు. దీంతో అవి తెలుపురంగులో తయారవుతాయి. వెంట్రుకలు తెల్లబడడానికి కొన్ని కారణాలు ఉంటాయని పరిశోధనల ఫలితంగా వెల్లడైంది. వయసుతోపాటు మనిషికి ఎదురయ్యే ఒత్తిడి వల్ల మెలనిన్‌ను ఉత్పత్తి చేసే జీవకణాలు తగ్గిపోతాయి. ధూమపానం చేసేవారిలోనూ ఇటువంటి పరిస్థితే ఎదురవుతుంది. శరీరానికి తగినంత బి12 విటమిన్‌ అందకపోయినా జుట్టు తెల్లబడుతుంది. రక్తహీనత వల్ల ఎర్రరక్తకణాల సంఖ్య, రోగనిరోధక శక్తి తగ్గినప్పుడూ, హార్మోన్ల స్థాయుల్లో మార్పు వచ్చినా.. ఇదే పరిస్థితి ఎదురవుతుందని పరిశోధనల్లో తేలింది.

- డాక్టర్‌. సి.వి.సర్వేశ్వర శర్మ,

ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్సు పరిషత్తు, అమలాపురం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని