చెంచాతో భలేగా..

నేస్తాలూ.. ఈ రోజు ఓ కొత్త ఆట నేర్చుకుందామా! కనీసం ఇద్దరు ఉంటే చాలు. దీన్ని ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఆడుకోవచ్ఛు ముందు నాలుగు బుట్టలు, ఈస్టర్‌ ఎగ్స్‌, రెండు చెంచాలు తీసుకోవాలి. ఈస్టర్‌ ఎగ్స్‌ లేకుంటే ప్లాస్టిక్‌

Published : 23 Jun 2020 00:09 IST

నేస్తాలూ.. ఈ రోజు ఓ కొత్త ఆట నేర్చుకుందామా! కనీసం ఇద్దరు ఉంటే చాలు. దీన్ని ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఆడుకోవచ్ఛు ముందు నాలుగు బుట్టలు, ఈస్టర్‌ ఎగ్స్‌, రెండు చెంచాలు తీసుకోవాలి. ఈస్టర్‌ ఎగ్స్‌ లేకుంటే ప్లాస్టిక్‌ బంతులైనా సరిపోతాయి. ఈస్టర్‌ ఎగ్స్‌ను రెండు బుట్టల్లో సమానంగా తీసుకోండి. పక్కనే మరో ఖాళీ బుట్టను పెట్టండి. ఇప్పుడు నోట్లో చెంచా పెట్టుకుని దాని సాయంతో ఓ బుట్టలోని ఈస్టర్‌ ఎగ్స్‌ను ఖాళీగా ఉన్న బుట్టలో వేయాలి. ఒక నిమిషంలో ఎవరు ఎన్ని వేస్తే వారే గెలిచినట్లు. దీన్ని మరింత ఆసక్తికరంగా ఆడాలంటే.. ఖాళీ బుట్టలు రెండే కాకుండా.. ప్రతి రంగు ఈస్టర్‌ఎగ్‌కు రెండేసి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. ఏ రంగు ఈస్టర్‌ ఎగ్‌ను ఆ రంగు బుట్టలోనే వేయాలి. ఎవరు ఎన్ని ఎక్కువ వేస్తే వాళ్లే గెలిచినట్లు. తప్పుగా వేస్తే మైనస్‌ పాయింట్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట మధ్యలో ఈస్టర్‌ ఎగ్స్‌ను చేతులతో తాకకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని