చూపు లేకపోయినా కలలు వస్తాయా?

చూపు బాగా ఉన్న వాళ్లలాగా దృశ్యాలు, సన్నివేశాలు, రూపాలు అంధుల కలల్లో ఉండవు....

Published : 24 Jun 2020 00:49 IST

ఎందుకు ఏమిటి ఎలా?

అంధులకు కలలు వస్తాయా? వస్తే అవి ఎలా ఉంటాయి?

- జి.వేదవ్యాస్‌, ఉరవకొండ

చూపు బాగా ఉన్న వాళ్లలాగా దృశ్యాలు, సన్నివేశాలు, రూపాలు అంధుల కలల్లో ఉండవు. కానీ నిద్రించేపుడు వారికి కూడా కలలు వస్తాయి. పంచేంద్రియాల్లో ముఖ్యమైంది దృష్టి. ఇలా కంటితో చూడగలిగిన విషయాలు కాకుండా స్పర్శ, రుచి, వినికిడి, వాసనల ద్వారా ఏయే అంశాలు.. వారు నిత్య జీవితంలో అనుభవిస్తారో, ఆ పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలే వారి కలల్లో వస్తాయి. ఏనుగు, చార్మినార్‌, పూర్తిగా బస్సు, విమానాల రూపాలు, వృక్షాల ఆకుల స్వరూపాలు సంపూర్ణంగా వారి స్వప్నాల్లో రావు. స్పర్శ ద్వారా గ్రహించిన రూపాలు కలల్లో వస్తాయి. జ్ఞానేంద్రియాల ద్వారా మెలకువలో ఉన్నప్పుడు మనకు తటస్థ పడిన పరిజ్ఞానాన్ని సమగ్ర పరుచుకునే పనిలో నిద్రించేప్పుడు మెదడులో జరిగే కార్యకలాపాలే కలలు. కళ్లున్నా లేకున్నా కలలు మాత్రం వస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని