రాఖీ.. కట్టేద్దాం!

నేస్తాలూ! రాఖీ కట్టడం, స్వీటు తినడం, అన్నయ్య, తమ్ముడుతో కలిసి సరదాగా ఆడుకోవడం. వాళ్లేమో చెల్లెల్లు, అక్కలకు బహుమతులో, డబ్బులో ఇవ్వడం బలే ఉంటుంది కదా! ఈ రాఖీ

Published : 03 Aug 2020 00:12 IST

నేస్తాలూ! రాఖీ కట్టడం, స్వీటు తినడం, అన్నయ్య, తమ్ముడుతో కలిసి సరదాగా ఆడుకోవడం. వాళ్లేమో చెల్లెల్లు, అక్కలకు బహుమతులో, డబ్బులో ఇవ్వడం బలే ఉంటుంది కదా! ఈ రాఖీ పండక్కి ఎప్పుడూ కొనేదేనా! ఈ సారి కొత్తగా, సులువుగా రాఖీ తయారు చేసి కట్టేద్దాం! అదెలాగో నేర్చుకోండి..

కావల్సినవి: ఎంబ్రయిడరీ దారం, పేపరు, కత్తెర, వాడని టూత్‌ బ్రష్‌, అట్టముక్క లేదా ఏదైనా కార్ఢు(ఆధార్‌/ఏటిఏం పనికి రానివి ఏమైనా ఉంటే..)

ఇలా చేయ్యాలన్నమాట! ముందుగా ఒక ఎంబ్రయిడరీ దారం తీసుకుని, దాన్ని కార్డుకు కొన్ని రౌండ్లు చుట్టాలి. తర్వాత దాన్ని తీసి దారం ఎక్కడా విడిపోకుండా మధ్యలో పట్టుకుని, అక్కడే దారంతో కట్టలా కట్టాలి. అప్పుడది ఒకవైపు కలిసి ఉంటుంది కాబట్టి దాన్ని కత్తిరించాలి. దాన్ని బ్రష్‌తో రుద్దాలి. అప్పుడు ఇలా గుండ్రంగా కనిపిస్తుంది. దాన్నలా చేశాక స్టిఫ్‌నెస్‌ కోసం ఒక పేపరు ముక్కను రౌండ్‌గా కత్తిరించి, గమ్‌తో దారం పోగుల మధ్యలో అంటించాలి. తర్వాత దానికి పొడవైన దారాన్ని అంటించాలి. కావాలంటే పైన చిన్న స్టోన్స్‌లాంటివి అంటించి, అలకరించుకోవచ్ఛు బలే సులువుగా అయిపోయింది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని