ఎంచక్కని పెన్‌హోల్డర్‌!

మన ఇంట్లో పనికిరాని ఎన్నో ప్లాస్టిక్‌ డబ్బాలుంటాయి. అవి వృథాగా చెత్తబుట్టలోకి వెళతాయి. పైగా వాటితో పర్యావరణానికీ ఎంతో కీడు. అందుకే అలాంటి డబ్బాలతో ఎంచక్కని పెన్‌హోల్డర్‌ తయారు చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకుందామా!

Published : 09 Feb 2021 01:00 IST

మన ఇంట్లో పనికిరాని ఎన్నో ప్లాస్టిక్‌ డబ్బాలుంటాయి. అవి వృథాగా చెత్తబుట్టలోకి వెళతాయి. పైగా వాటితో పర్యావరణానికీ ఎంతో కీడు. అందుకే అలాంటి డబ్బాలతో ఎంచక్కని పెన్‌హోల్డర్‌ తయారు చేసుకోవచ్చు. ఎలానో తెలుసుకుందామా!
కావాల్సిన వస్తువులు
* ప్లాస్టిక్‌ డబ్బాలు
* నల్లరంగు

* జిగురు

* తెల్ల కాగితం  

ఎలా తయారు చేయాలంటే..
ముందుగా అమ్మను అడిగి ఇంట్లో ఖాళీగా ఉన్న రెండు ప్లాస్టిక్‌ డబ్బాలు తీసుకోండి. వాటిని నాన్నను చిత్రంలో చూపించినట్లుగా సగానికి కత్తిరించి ఇవ్వమని అడగండి. తర్వాత పెద్దల సాయంతో వాటికి జాగ్రత్తగా నల్లని రంగు వేయండి. అవి ఆరేంతవరకు అలా వదిలేయండి. ఇప్పుడు పేపర్‌ పంచ్‌ మిషన్‌ తీసుకుని తెల్లకాగితాన్ని పంచ్‌ చేస్తూ ఉండండి. చిన్న చిన్న వృత్తాల్లాంటి కాగితపు ముక్కలు పోగవుతాయి. వాటిని సేకరించుకోండి. ఇంతకు ముందే సిద్ధం చేసి పెట్టుకున్న డబ్బాలకు జిగురు సాయంతో కాస్త ఖాళీ వదులుతూ ఈ చిన్ని చిన్ని కాగితపు ముక్కలు అతికించుకోండి. ఇంకేం చక్కని పెన్‌హోల్డర్లు సిద్ధం అవుతాయి. వంటగదిలోనో.. డైనింగ్‌ టేబుల్‌ మీదో స్పూన్లు పెట్టుకునేందుకూ వీటిని వాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని