స్ట్రాతో అవాక్కయ్యేలా..

హాయ్‌.. నేస్తాలూ.. మనం అప్పుడప్పుడు కూల్‌డ్రింక్స్‌ తాగుతాం కదా! కొందరికి స్ట్రాలతో తాగడం అంటే భలే ఇష్టం కదూ! ఇదిగో ఇప్పుడు అలాంటి స్ట్రాతోనే ఓ మ్యాజిక్‌ చేయడం ఎలానో తెలుసుకుందాం సరేనా!మొదటగా

Published : 14 Mar 2021 00:50 IST

అబ్రకదబ్ర హాం ఫట్‌!

హాయ్‌.. నేస్తాలూ.. మనం అప్పుడప్పుడు కూల్‌డ్రింక్స్‌ తాగుతాం కదా! కొందరికి స్ట్రాలతో తాగడం అంటే భలే ఇష్టం కదూ! ఇదిగో ఇప్పుడు అలాంటి స్ట్రాతోనే ఓ మ్యాజిక్‌ చేయడం ఎలానో తెలుసుకుందాం సరేనా!
మొదటగా మీరు రెండు చేతులను మూసి ఉంచి ప్రేక్షకులకు చూపిస్తారు. ఇప్పుడు ఒక చేతిని తెరిచి మూసి ఉన్న మరో చేతి నుంచి నెమ్మదిగా లాగుతూ స్ట్రాను బయటకు తీస్తారు. ఇప్పుడు రెండు చేతులనూ చూపిస్తారు. అందరూ అవాక్కవుతారు. మూసి ఉన్న చేయిలోకి అంతపొడవైన స్ట్రా ఎలా వచ్చిందబ్బా... అని ఆలోచిస్తారు. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది... అని మీరూ అనుకుంటున్నారు కదూ..! ఓ చిన్న ట్రిక్‌తో అది సాధ్యమే.. అదేంటో తెలుసుకుందామా మరి!


కిటుకు ఏంటంటే...
నిజానికి కిటుకంతా స్ట్రాలోనే ఉంది. అవును.. మనం మ్యాజిక్‌ చేయడానికి ముందే స్ట్రాను ఓ వైపు నిలువుగా జాగ్రత్తగా అమ్మానాన్న సాయంతో కత్తిరించుకోవాలి. దాన్ని గుండ్రంగా మడిచి చేతిలో పెట్టుకుని పిడికిలి మూసేయాలి. తర్వాత మరో చేతితో స్ట్రా కొనను పట్టుకొని నెమ్మదిగా లాగాలి. అంతే.. స్ట్రా బయటకు వస్తుంది.

జాగ్రత్తలు..  
స్ట్రాను కత్తిరించి, మడిచిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఇవన్నీ మ్యాజిక్‌ చేయడానికి ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ మ్యాజిక్‌ కోసం వాడే స్ట్రా కాస్త మందంగా ఉంటే మంచిది. ప్రదర్శన ఇవ్వడానికి ముందే ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్‌ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని