మీ మాస్క్‌కు మైకుందా?!
ఏంటి నేస్తాలూ...! శీర్షిక చదివి అవాక్కయ్యారా! ‘మాస్కేంటి.. దానికి మైకేంటి?’ అని ఆలోచిస్తున్నారా.. మీరు చదివింది నిజంగా నిజమే ఫ్రెండ్స్. ఈ వినూత్న ఆలోచన ఓ అన్నయ్యకు వచ్చింది. రావడమే ఆలస్యం వెంటనే ఆచరణలో పెట్టేశాడు.
ఈ అన్నయ్య పేరు కెవిన్ జాకొబ్ సెనోజ్. వయసు.. 19. ఊరు.. కేరళలోని త్రిస్సూర్. ప్రస్తుతం ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మీరు గమనించే ఉంటారు. మనం మాస్కు పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఎదుటివారికి మన మాటలు స్పష్టంగా వినిపించవు. అప్పుడు మనం మాస్క్ తీసి మాట్లాడాల్సి వస్తుంది. కానీ కరోనా నేపథ్యంలో ఇది చాలా ప్రమాదకరం. ఒక్క క్షణం చాలు వైరస్ మనలోకి ప్రవేశించడానికి. అందుకే బహిరంగ ప్రదేశాల్లో మాస్కును ముక్కు, నోటి కిందకు అస్సలు దించకూడదు.
వైద్యులకు మరిన్ని తిప్పలు
మనకే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఫ్రంట్‌లైన్ వారియర్లు అయిన వైద్యులు, నర్సుల పరిస్థితి మరింత ఘోరం. వాళ్లు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్, ఫేస్‌షీల్డు కచ్చితంగా వాడాల్సి ఉంటుంది. రోగులతో మాట్లాడేటప్పుడు, వాళ్లకు విషయాన్ని వివరించేటప్పుడు మరిన్ని తిప్పలు తప్పవు. చాలా గట్టిగా మాట్లాడినా అవతలి వాళ్లకు సరిగా అర్థం కాదు. పైగా ప్రతీసారీ గొంతు చించుకుని మాట్లాడాలంటే అయ్యేపనికాదు కదా..!
అమ్మానాన్న కోసం...
కెవిన్ వాళ్ల అమ్మానాన్న కూడా వైద్యులే. అందుకే వాళ్లు విధి నిర్వహణలో పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని.. ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే మైక్ మాస్క్! ఓ చిన్న మైక్, ఆంప్లిఫ్లయర్, స్పీకర్, బ్యాటరీ సాయంతో అక్టోబర్ 2020లోనే దీన్ని తయారు చేశాడు. ఈ ప్రయోగం విజయవంతమైంది. మరో విషయం ఈ మైక్‌ను ఏ మాస్క్‌కైనా బిగించుకోవచ్చు. అవసరం లేనప్పుడు శానిటైజ్ చేసుకుని తొలగించుకోవచ్చు.
ఎంతో ఉపయోగకరం
కెవిన్ తల్లిదండ్రులు ఈ మైక్ మాస్కులను వాడటం చూసి తోటి వైద్యులు కూడా తమకూ ఇలాంటి మైక్‌లు చేసివ్వమని కోరారు. దీంతో కెవిన్ వాళ్లకూ తయారు చేసిచ్చాడు. ఈ మైక్‌ను కేవలం మాస్క్‌కే కాదు. ఫేస్ షీల్డ్, టీషర్టు కాలర్‌కు కూడా బిగించుకోవచ్చు. ‘ఏవైనా కంపెనీలు ముందుకొచ్చి సాయం చేస్తే ఈ మాస్క్ మైకులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తా. ఇవి కరోనా ప్రత్యేక వార్డుల్లో సేవలు అందించే వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి’ అంటున్నాడు మన కెవిన్. ఎంతైనా ఈ అన్నయ్య ఆలోచన, ఆచరణ అదుర్స్ కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: విశ్రాంత ఐఏఎస్ అధికారికి మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా
-
India News
Amit Shah: బెంగాల్లో ఘర్షణలపై హోం మంత్రి అమిత్ షా ఆరా.. గవర్నర్‌కు ఫోన్
-
Sports News
GT vs CSK: రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ మిస్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ