బెనిన్.. ఇదో కవలల దేశం!
నేస్తాలూ.. మీకు బెనిన్ తెలుసా..? అదో చిన్న దేశం. మనలో చాలా మంది ఇంతకు ముందు దాని పేరు కూడా విని ఉండరు. కానీ ఈ దేశానికో ప్రత్యేకత ఉంది. దీనికి కవలల దేశం అని పేరు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇక్కడ పుట్టినంత మంది కవలలు పుట్టరట. భలే తమాషాగా
ఉంది కదూ..!
ఆ దేశం పేరు బెనిన్. ఆఫ్రికా ఖండంలో ఉందిది. ఈ దేశంలో ఎక్కడ చూసినా కవలలు ఎక్కువగా పుడుతున్నారు. ఇది గమనించిన పరిశోధకులు సర్వే చేస్తే ఆశ్చర్యపోయే విషయం తెలిసింది. అదేంటంటే.. ప్రపంచవ్యాప్త సగటు ప్రతి వెయ్యి మందికి 13.1 మంది పుడుతుంటే ఈ దేశంలో మాత్రం 27.9 మంది కవలలు పుడుతున్నారు. అదే కనుక మన ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో అయితే ఈ సంఖ్య కేవలం 9గానే ఉంది.
ఎందుకిలా?
ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకూ తేలలేదు. పరిశోధకులు మాత్రం తినే తిండి బట్టి, అక్కడి వాతావరణం బట్టి అలా జరగొచ్చనే అభిప్రాయాలు చెబుతున్నారు కానీ సరైన కారణాలు మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఈ కవలలు కూడా బెనిన్, నైజీరియా, టోగో వంటి దేశాల్లో నివసించే యురూబా అనే తెగలోనే ఎక్కువగా పుడుతున్నారట. ఏదేమైనప్పటికీ కవలల దేశంగా బెనిన్ అందరికీ గుర్తుండిపోతుంది. అదన్నమాట సంగతి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Goats milk: మేక పాలతో మేలెంతో తెలుసా..?
-
Crime News
Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
-
India News
Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
India News
Constitution: ‘దోపిడికి ఉపయోగపడేలా ఉంది’.. రాజ్యాంగంపై కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
India News
Prisoners Release: ఖైదీలకు ‘ప్రత్యేక విముక్తి’.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!