అరరే.. మాయమై‘నది’!
నది మాయమవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి సాధారణంగా నదులు సముద్రంలో కలుస్తాయి. కానీ ఈ నది ఎడారిలో కలిసి మాయమవుతుంది. ఇంతకీ ఇదేం నది? ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రండి..
ఎడారిలో కలిసే ప్రత్యేకత ఉన్న ఈ నది పేరు లూని. దీన్ని ఆంగ్లంలో ‘సైలైన్ రివర్’ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని ఆరావళి శ్రేణుల్లో ఉండే నాగాహిల్స్ బండరాళ్ల నుంచి ప్రవహిస్తుంది.
ఎడారిలోకి ఇలా..
ఈ నది నాగౌర్, పాలి, జోధ్‌పుర్, బర్మేర్, జాలోర్ జిల్లాల గుండా 495 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇవన్నీ దాటుకుని రాజస్థాన్‌లోని థార్ ఎడారిలోకి అడుగు పెడుతుంది. ఆ తర్వాత రన్ ఆఫ్ కచ్ (గుజరాత్) ఈశాన్య భాగంలోని బెరైన్ దగ్గర ఇసుక దిబ్బల్లో కలిసి మాయమైపోతుంది.
పర్యాటకంగా ప్రసిద్ధి
రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లా బలోత్రా దగ్గర ఈ నది ప్రవహిస్తున్నప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది. దీన్ని చూడ్డానికి రెండుకళ్లూ చాలవు. అందుకే అక్కడికి పర్యాటకులు ఎక్కువగా వెళుతుంటారు. అన్నట్లు ఆధ్యాత్మికంగా కూడా ఇది ప్రసిద్ధి. మార్చిలో జరిగే థార్ పండగకు లక్షలమంది వచ్చి ఈ నదీ పాయల్లో స్నానాలు చేస్తారు. అలాగే ఈ నదీ తీర ప్రాంతంలో అక్రమ కట్టడాలూ ఎక్కువే! ఈ నది పక్కనే ఉన్న ఊళ్లలో డ్రైనేజీ నీరు కూడా ఇందులోకే వస్తుంది. అందుకే ఈ నది కాలుష్యం గురించి తరచూ వార్తలు వస్తుంటాయి.
ప్రకృతికి విరుద్ధంగా..
కొండల్లో పుట్టి ప్రవహించే ఈ నది ప్రకృతికి విరుద్ధంగా ఎడారిలో కలుస్తుందేంటి అని పరిశోధకులు ఇప్పటికీ శోధిస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. తీరం వెంబడి ఉండే స్థానికులేమో ఇదంతా ఈశ్వరశాపం అందుకే ఇలా జరుగుతోంది అని చెబుతుంటారు. ఏదేమైనా ఈ మిస్టరీ ఎప్పటికి వీడుతుందో వేచి చూడాల్సిందే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!