అయిపోదామా.. బుజ్జి రవివర్మలం! ఆటబొమ్మ

సంవత్సరం కాలం నుంచి స్మార్ట్‌ఫోన్లకే అంకితమై పోయాం. ఆన్‌లైన్‌ క్లాసులైతే ఏంటి? కాలక్షేపం కోసం వీడియో గేమ్స్‌ అయితే ఏంటి? ఇప్పుడు కాసేపు స్మార్ట్‌ఫోన్లను పక్కన పెట్టేద్దామా..!

Published : 21 Jun 2021 01:21 IST

సంవత్సరం కాలం నుంచి స్మార్ట్‌ఫోన్లకే అంకితమై పోయాం. ఆన్‌లైన్‌ క్లాసులైతే ఏంటి? కాలక్షేపం కోసం వీడియో గేమ్స్‌ అయితే ఏంటి? ఇప్పుడు కాసేపు స్మార్ట్‌ఫోన్లను పక్కన పెట్టేద్దామా..! అమ్మో.. మరి మాకు బోర్‌ కొట్టదూ అంటారేమో..! అందుకో మార్గం ఉంది. అదేంటో తెలుసుకుందామా!

కరోనా వల్ల పాఠశాలలు లేవు. ఆడుకోవడానికి స్నేహితులూ లేరు. మరేం చేద్దాం. మీకు ఎలానో బొమ్మలంటే ఇష్టమేగా వాటినే గీయండి. ప్చ్‌... ఇంతా చెప్పి ఇప్పుడు వాటికోసం పుస్తకాలు, పెన్సిళ్లు, రబ్బర్లు పట్టుకోమంటారా అని దిగులు చెందకండి. ఎందుకంటే..

రైటింగ్‌ టాబ్లెట్‌ పాడ్‌ ఉందిగా...
ఇదిగో ఈ ఒక్క ఎల్‌సీడీ రైటింగ్‌ టాబ్లెట్‌ పాడ్‌ ఉంటే చాలు. మామూలుగా బొమ్మ వేశాక తప్పు వస్తే చెరపాలి. ఎక్కువ తప్పులొస్తే ఆ పేపర్‌ పక్కన పెట్టేస్తాం. అలా బోలెడన్ని కాగితాలు వృథా అవుతాయి. కానీ ఈ పాడ్‌లో బొమ్మ వేయడానికి ఒక బటన్‌ నొక్కాలి. అది తప్పు వస్తే చెరుపుకోవడానికి ఇంకో బటన్‌ ఉంటుంది. రంగులు కూడా వేసుకోవచ్చు.

ఒక్కసారి కాదు.. లక్ష సార్లు!

అలా దాదాపు లక్షసార్లు బొమ్మల్ని వేసుకోవచ్చు. అందులో ఉండే బ్యాటరీ 6 నెలలు వస్తుంది. మళ్లీ దాన్ని మార్చుకోవడమే! ఇంకో విషయం ఏంటంటే ఫోన్‌లాగా దీనికి రేడియేషన్‌ ప్రభావమేమీ ఉండదు. నోట్‌బుక్‌లో వేస్తున్నట్లే ఉంటుంది కాబట్టి కళ్లకు ఎలాంటి హానీ జరగదన్నమాట. ఇంకేం ఈ రైటింగ్‌ పాడ్‌  తెచ్చుకుని ఎంచక్కా మీ సృజనాత్మకతను వెలికి తీయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని