కాలుష్యం.. కాళ్ల కిందకు వచ్చింది!
కాలుష్యం... ఈ మూడక్షరాల పదం ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తోంది. ఇక వాయుకాలుష్యం సంగతి సరేసరి! నగరాలు, పట్టణాల్లో అయితే మరీ తీవ్రం. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు.. గాల్లో కలిసిన కాలుష్యాన్ని... గాలి నుంచే వేరు చేస్తే.. దాంతోనే టైల్స్ చేస్తే.. ఐడియా అదుర్స్ కదూ! కేవలం ఆలోచనే కాదు.. ఆచరణ కూడా అదుర్సే..
తేజస్ అనే అన్నయ్య ఓ ఆర్కిటెక్చర్. కార్బన్ నుంచి టైల్స్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది ఈయనకే. చిన్నప్పటి నుంచే ప్రకృతి అన్నా.. పర్యావరణ పరిరక్షణ అన్నా ప్రేమ ఎక్కువ. అదే తేజస్‌ను ఇటు వైపునకు నడిపించింది. అలా కాలుష్యాన్ని కాళ్ల కిందకు తెచ్చే పనిలో పడ్డాడు.
ముంబై కేంద్రంగా..
ఇంతకు ముందే ఓ సంస్థ కాలుష్య కారకమైన కార్బన్‌ను గాలి నుంచి వేరుచేసి ఇటుకల తయారీ మీద ప్రయోగాలు చేస్తోందని తెలుసుకున్నాడు. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఆ ఇటుకల ధర కూడా అధికంగా ఉండేది. అవి సామాన్యులెవ్వరూ కొనలేరు. పైగా ఆ ఇటుకల తయారీకి చాలా సమయం పడుతోంది. అలాంటప్పుడు దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఆ కార్బన్ నుంచి టైల్స్ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఆ సంస్థ సహకారంతో ఈ కోణంలో ప్రయోగాలు ప్రారంభించాడు. 2019లో ముంబై కేంద్రంగా ‘కార్బన్ క్రాఫ్ట్ డిజైన్’ స్టార్టప్‌ను ప్రారంభించాడు.
పూర్తిగా చేత్తోనే...
ప్రస్తుతం ఈ కార్బన్ టైల్స్‌ను పూర్తిగా చేత్తోనే తయారు చేయిస్తున్నారు. ధర కూడా అందుబాటులోనే ఉంటోంది. ఒక టైల్ తయారైందంటే 30,000 లీటర్ల గాలిని శుద్ధి చేసినట్లేనంట. ఇళ్లలో వాడేందుకు ఈ కార్బన్ టైల్స్ బాగుంటాయి. వాతావరణమూ బాగు పడుతుంది అని ప్రకృతి ప్రేమికులు కూడా కితాబిస్తున్నారు. నేస్తాలూ.. మీరూ కార్బన్ టైల్స్ తయారు చేద్దాం అని చూస్తున్నారా ఏంటి? మనం చిన్న పిల్లలం కదా.. ప్రస్తుతానికి ఆ పని చేయలేం. కానీ.. పెద్ద సంఖ్యలో మొక్కల్ని అయితే నాటుదాం. అసలే వర్షాకాలం కదా.. వాటికి పెద్దగా నీళ్లు పోయాల్సిన అవసరమూ ఉండదు. ఏమంటారు? ఇంకెందుకాలస్యం అమ్మానాన్న సాయంతో పెరట్లో మొక్కలు నాటేద్దాం పదండి మరి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!