చిట్టి పొట్టి చిన్నారి.. ఆకాశంలో పొన్నారి!
హాయ్ నేస్తాలూ! బాగున్నారా.. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు ఆడుకునే బొమ్మననుకుంటున్నారా ఏంటి? కానేకాదు.. నేను నిజమైన విమానాన్నే.. మీకో విషయం తెలుసా.. నా పేరిట గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉందోచ్! ఎందుకో.. ఏమిటో.. ఎలానో
మీకు తెలుసుకోవాలని ఉందా..?
అన్నట్లు ఇంతకీ నా పేరు చెప్పనేలేదు కదూ! స్టిట్స్ ఎస్‌ఎ-2ఎ స్కైబేబీ. మీరు ముద్దుగా స్కైబేబీ అని పిలుచుకోండి సరేనా.
నా పుట్టిన రోజు 26 మే. ఎందుకంటే మొదటిసారిగా నేను 1952లో అదే రోజున తొలిసారిగా కాలిఫోర్నియాలో గాల్లో ఎగిరాను. నాకు ఇద్దరు వ్యక్తులు ప్రాణం పోశారు. రే స్టిట్స్ నన్ను డిజైన్ చేస్తే, బాబ్ స్టార్ అనే వ్యక్తి నన్ను తయారు చేశాడు.
నా బరువు ఎంతంటే...
నేను బుజ్జి విమానాన్ని నాలో ఒక్కరు మాత్రమే కూర్చోగలరు. నా బరువు కేవలం 77 కిలోలు. అంటే ద్విచక్రవాహనం కన్నా కూడా తక్కువన్నమాట. పొడవేమో తొమ్మిది అడుగుల పది అంగుళాలు. రెక్కల పొడవు ఏడు అడుగుల రెండు అంగుళాలు. ఎత్తు అయిదు అడుగులు. పైలట్ నడపగలిగే విభాగంలో ప్రపంచంలోనే అత్యంత చిన్నవిమానంగా నాకు ‘గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వారు గుర్తింపునిచ్చారు. 1984 వరకూ ఈ రికార్డు నా పేరిటే ఉంది. తర్వాత దీన్ని బంబుల్ బీ- 2 అనే మరో బుల్లి విమానం సొంతం చేసుకుంది. మిమ్మల్ని పలకరించడానికి ఇప్పుడు నాతో పాటు దాన్నీ రమ్మన్నాను. కానీ పాపం.. దానికి వేరే పని ఉండి రాలేదంట! మళ్లీ ఎప్పుడైనా వస్తానని మీతో చెప్పమని చెప్పింది.
ఆరునెలలకే రిటైర్..
మే 26 1952న నేను తొలిసారి గాల్లోకి ఎగిరితే.. అదే ఏడాది అక్టోబర్‌లో నాకు రిటైర్‌మెంట్ ఇచ్చారు. అంటే అటూ ఇటూగా ఆరునెలలే అన్నమాట. ఇలా మొత్తానికి నేను కేవలం 25 గంటలు మాత్రమే గాల్లో ప్రయాణించాను. తర్వాత నన్ను నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం వాళ్లకు ఇచ్చేశారు. ఇప్పటికీ నేను అక్కడే ఉంటున్నాను. మరో విషయం ఏంటంటే నాలాంటి విమానం ఇక ప్రపంచంలో మరోటి లేదు. నన్ను ఒక్కదాన్నే తయారు చేశారు మరి. నిజానికి గిన్నిస్ రికార్డు సాధించాలనే ఉద్దేశంతోనే నాకు ప్రాణం పోశారు. మొత్తానికి ఇవీ నా విశేషాలు. నేస్తాలూ! ఇక ఉంటామరి.. బై.. బై!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక