జోక్ నుంచి పుట్టిన మొక్క.. పొమాటో!
‘మొక్కేంటి... జోక్ నుంచి పుట్టడమేంటి.. పోనీ కాసేపు పుట్టిందే అనుకుందాం.. టొమాటో తెలుసు... పొటాటో తెలుసు.. మరి ఈ పొమాటో ఏంటి? అసలు ఇదేం మొక్క? ఇంతకీ ఇదేం పేరు?’అని తెగ బుర్రగోక్కుంటున్నారు కదూ! వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వస్తున్నా..!!
హాయ్ నేస్తాలూ..! ఎలా ఉన్నారు? ఏంటి అలా బుంగమూతి పెట్టుకున్నారు. ఏం చెప్పమంటారు చెప్పండి.. నాకూ రావాలనే ఉంది. కానీ ఏం చేస్తాం. లాక్‌డౌన్ కదా.. నన్ను అస్సలు మా అమ్మ బయటకే పంపడం లేదు. ఇప్పుడు ఎలాగో బతిమాలుకుని మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను. మీకు తెలుసుగా ఈ చిన్నూ మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఉత్త చేతులతో రాడని.. అందుకే పొమాటో మొక్క విశేషాలు మోసుకొచ్చాను. ఇంకేం తెలుసుకుంటారా మరి..
నిజంగా ఇది నిజం...
ఈ మొక్కను చూసి ఆశ్చర్యపోతున్నారు కదూ!.. పైనేమో పండు పండు టొమాటోలతో, అడుగున బంగాళాదుంపలతో భలే ఉంది కదూ! ఇది గ్రాఫిక్కేమో అని అనుమానం అక్కర్లేదు. నిజంగా ఇది నిజమైన మొక్కే. పాల్‌హాన్సర్డ్ అనే అమెరికా వ్యాపారికి వచ్చిన ఆలోచనే దీనికి ప్రాణం పోసింది. ఏంటి మళ్లీ అలా.. అయోమయంగా మొహం పెట్టారు. ఓహో.. పైనేమో జోక్ నుంచి పొమాటో మొక్క పుట్టింది అని చెప్పి.. ఇప్పుడేమో ఆలోచన ప్రాణం పోసిందని అంటున్నా ఏంటి అనుకుంటున్నారా? అబ్బా.. నన్ను మొత్తం చెప్పనీయండి ముందు.
ఎక్కువగా కెన్యాలో....
ఆ.. ఇంతకీ ఎక్కడ వరకు వచ్చాను? ఆ.. గుర్తొచ్చింది.. ఆ అమెరికా వ్యాపారి ఒకానొక సందర్భంలో ఎవరితోనో జోక్‌గా టొమాటో, పొటాటో కలిపితే పొమాటో అన్నాడంట. దాన్ని కొన్నాళ్లకు ఆయనే నిజం చేశాడు. అలా అలా ఇతర దేశాలకూ పాకింది. ముఖ్యంగా కెన్యాలో ఎక్కువగా ఈ మొక్కను పెంచుతున్నారు. అయినా ఒకే మొక్కకు రెండు రకాల కూరగాయలా? ఎలా సాధ్యం అంటారా... ఎలా అంటే...
స్థలం.. శ్రమ.. ఆదా!
పొమాటో అనేది ఒక అంటుమొక్క. టొమాటో, పొటాటో ఈ రెండూ సోలనాసి కుటుంబంలోని సోలనం జాతికి చెందినవి. రెండూ ఒకే జాతివి కావడంతో అవి పెరగడానికి కావల్సిన పోషకాల్ని సమంగా పంచుకుంటాయి. అందుకే ఈ మొక్కకు అంటు కట్టిన తర్వాత, చక్కగా ఎదిగి రెండు రకాల కూరగాయల్ని అందిస్తోంది. ఈ రకంగా పెంచడం వల్ల స్థలం, శ్రమ రెండూ ఆదా అవుతాయన్నమాట. రైతుకు భలే గిట్టుబాటు అవుతుంది.
ఇంతకీ అంటు ఎలా కడతారంటే..
ముందుగా ఈ టొమాటో, పొటాటో మొక్కల్ని తీసుకుని, ఒకదాని దగ్గరగా మరొకటి ఉండేలా భూమిలో పాతాలి. ఆ తర్వాత పొటాటో మొక్కకు ఒకే ఒక రెమ్మను ఉంచి మిగతా రెమ్మల్ని కత్తిరించాలి. మిగిలిన రెమ్మకు, సన్నగా చీల్చిన టొమాటో మొక్క రెమ్మను జతచేసి దానికి అంటుకట్టాలి. అంటు కట్టిన భాగం వరకూ మళ్లీ మట్టిని పోయాలి. ఇలా చేశాక దానికి చక్కగా నీళ్లు పోస్తూ పెంచితే సరి. ఫ్రెండ్స్... ఇవీ పొమాటో విశేషాలు. ఉంటామరి.. అదిగో.. మా అమ్మ ‘చిన్నూ.. చిన్నూ..’ అని పిలుస్తోంది. ఈ సారి వచ్చేటప్పుడు మరో ఆసక్తికరమైన విశేషంతో వస్తాను.. బై.. బై..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?
-
World News
United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు
-
Politics News
Andhra News: ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సవాల్