బుజ్జి బుడత.. భలే ఘనత!
స్కేటింగ్ చేయడమే మనకు చాలా కష్టం.. అలాంటిది స్కేటింగ్ షూస్ వేసుకుని.. స్కిప్పింగ్ చేయడం అంటే.. అమ్మో ఇంకా ఏమైనా ఉందా..? మనమైతే కచ్చితంగా కిందపడిపోతాం.. కానీ ఓ ఆరేళ్ల బుడత మాత్రం ఎంచక్కా చేసి చూపిస్తోంది. అసాధ్యాన్ని.. సుసాధ్యంగా మార్చి అందర్నీ అవాక్కయ్యేలా చేసి.. రికార్డునూ కొట్టేసింది.
ద్విజా బైజల్ కింజల్ చెద్దాకు ఆరేళ్లు. మహారాష్ట్రలోని ముంబయిలో ప్రస్తుతం ఈ చిన్నారి ఒకటో తరగతి చదువుతోంది. చూస్తే అమాయకంగా.. తనకేమీ తెలియదన్నట్లు కనిపించే ఈ ద్విజాలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. స్కేటింగే కష్టం అనుకుంటే కాళ్లకు స్కేటింగ్ షూస్ వేసుకుని మరీ స్కిప్పింగ్ చేయడం ఈ బుడత ప్రత్యేకం. అదీ ఏదో మామూలుగా కాదు. 30 సెకన్లలోనే 40 స్కిప్పింగ్లు చేసి రికార్డు సృష్టించేసింది. అంటే సెకనుకు ఒక స్కిప్పింగ్ కంటే ఎక్కువే చేసిందన్నమాట. తన కోచ్, మెంటార్ మందర్ షిండే పర్యవేక్షణలో జులై 10న ద్విజా ఈ ఫీట్ చేసి ‘వరల్డ్ రికార్డ్స్ ఇండియా’లో స్థానం సంపాదించేసింది. ఇంత చిన్న వయసులోనే అంత ఘనత సాధించడమంటే నిజంగా గ్రేట్ కదూ! ఈ రికార్డు కోసం తను ఎంత కష్టపడి ఉంటుందో కదా! పైగా భవిష్యత్తులో తాను మరిన్ని రికార్డులు సృష్టించాలనుకుంటున్నట్లు చెబుతోంది. ప్రత్యేక శిక్షణ లేకుండానే ఇలా చేయాలని మీరు మాత్రం అస్సలు ప్రయత్నించొద్దు సరేనా!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా