పండు.. పండు.. ఎర్ర పండు..!
ఏంటి.. అలా వింతగా చూస్తున్నారు. ‘ఈ పండేంటి.. అచ్చం కరోనా వైరస్‌లా ఉంది’ అని ఆలోచిస్తున్నారు కదూ! ఈ పండు పేరు రంబుటన్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి కరోనా వైరస్‌కు అసలు సంబంధమే లేదు. చూడ్డానికి ముళ్లతో అలా కనిపిస్తుందంతే!
ఈ పండు గురించి తాజా విశేషం ఏంటంటే.. కేరళలో నిఫా వైరస్ కేసు ఒకటి ఓ బాలుడిలో బయట పడింది. ఈ పండు తిన్నాకే అనారోగ్యానికి గురయ్యాడని అంటున్నారు. ‘ఓహో.. చూడ్డానికి కరోనా వైరస్‌లా ఉండే ఈ పండును తింటే నిఫా వైరస్ వస్తుందన్నమాట’ అనుకుంటున్నారా! కానీ అదేం లేదు. గబ్బిలం కొరికిన రంబుటన్ పండు తినడం వల్ల ఆ బాలుడికి నిఫా వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇంకా కచ్చితంగా అయితే తేల్చలేదు.
ఎప్పుడూ చూడలేదే!
‘అవును.. ఇంతకీ ఈ రంబుటన్ పండును మేము ఎప్పుడూ చూడలేదే! కనీసం పేరు కూడా వినలేదేంటబ్బా..?’ అనే అనుమానం మీకు వచ్చింది కదా! నిజానికి ఇది మన దేశానికి చెందిన పండు కాదు. ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్‌లో పండుతుంది. మధ్య అమెరికా, ఆఫ్రికాలోనూ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఇక మన దగ్గర కేరళలో కూడా ఈ రంబుటన్ చెట్లను పెంచుతున్నారు.
పేరుకు అర్థం తెలుసా..
మలయ్ భాషలో రంబుటన్ అంటే జుట్టు అని అర్థం. ఈ పండుకు కూడా బయట వెంట్రుకలను పోలిన కొమ్ములు ఉంటాయి కదా! అందుకే ఈ పేరు పెట్టి ఉంటారు. అరబ్బు వర్తకుల ద్వారా ఈ చెట్లు ఆఫ్రికా, అమెరికా, క్యూబా లాంటి దేశాలకూ విస్తరించాయి.
వీటిలోనూ ఆడ.. మగ..
ఈ చెట్లలోనూ ఆడ, మగ చెట్లుంటాయి. మగ చెట్లకు అసలు కాయలు కాయవు. కేవలం ఆడవాటికే కాస్తాయి. ఈ పండు తొక్క ఎరుపు రంగులో ఉంటుంది. పసుపు, ఆరెంజ్ రంగులో తొక్క ఉండే రకాలూ ఉన్నాయి. కానీ ఇవి చాలా అరుదు. ఒక్కో పండులో ఒక్కో విత్తనమే ఉంటుంది. ఈ పండు లోపల గుజ్జు తెలుపు, లేత గులాబీ రంగులో ఉంటుంది. దీని రుచి కొంచెం తియ్యగా కొంచెం పుల్లగా ఉంటుంది. అంటే కాస్త అటూఇటూగా ద్రాక్షలా అనుకోవచ్చు. నేస్తాలూ..! మొత్తానికి ఇవీ రంబుటన్ పండు విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!