నేను అందరి కన్నా చిన్నోచ్!
‘వేలెడంత లేవు.. కానీ ఎంత అల్లరి చేస్తున్నావో?’ అని మిమ్మల్ని ఇంట్లో అమ్మానాన్న అప్పుడప్పుడు అంటుంటారు కదూ! మీలో గడుసు వాళ్లు ఉంటే.. ‘నేను వేలు కన్నా పెద్దగానే ఉన్నా.. కావాలంటే
‘వేలెడంత లేవు.. కానీ ఎంత అల్లరి చేస్తున్నావో?’ అని మిమ్మల్ని ఇంట్లో అమ్మానాన్న అప్పుడప్పుడు అంటుంటారు కదూ! మీలో గడుసు వాళ్లు ఉంటే.. ‘నేను వేలు కన్నా పెద్దగానే ఉన్నా.. కావాలంటే చూసుకో..!’ అని సమాధానం ఇస్తారు. కానీ నేను మాత్రం అలా చెప్పుకోలేను. ఎందుకంటే.. నేను కనీసం వేలెడంత కూడా ఉండను మరి. మహా అయితే గోరంత ఉంటానేమో..! ఇంతకీ నేనేవరంటే..
చూస్తే జెల్లీలా కనిపిస్తున్న నాపేరు ఆక్టోపస్ వుల్ఫీ. స్టార్ సక్కర్ పిగ్నీ ఆక్టోపస్ అని కూడా పిలుస్తుంటారు. మీరు మాత్రం ముద్దుగా వుల్ఫీ అని పిలిచేయండి.. సరేనా! ఈ భూగోళం మొత్తం మీద దాదాపు 300లకు పైనే ఆక్టోపస్ రకాలున్నాయి. అందులో నేనే ప్రపంచంలో కెల్లా అత్యంత చిన్న ఆక్టోపస్‌ను. మాలోనూ మళ్లీ కొన్ని రకాలున్నాయి!
నల్ల కళ్లు.. తెల్ల ఒళ్లు!
నాకు రెండు నల్లకళ్లుంటాయి. నీళ్లలా పారదర్శక రంగులో నా శరీరం ఉంటుంది. చిన్న చిన్న మచ్చలు కూడా ఉంటాయి. ఇవి ఉన్నాయి కాబట్టే ఆ మాత్రమైనా నా ఉనికి మీరు గుర్తించగలుగుతున్నారు. మేం చాలా అరుదైన జీవులం. మమ్మల్ని గాలించి పట్టుకోవడం కూడా మీకు తలకు మించిన పని. అందుకే ఇప్పటికీ నా గురించి పూర్తిగా బాహ్య ప్రపంచానికి తెలియదు.
అంగుళం ఉంటానంతే..
నేను దాదాపు 2.5 సెంటీమీటర్ల పొడవుంటాను. అంటే ఒక అంగుళం. ఇక బరువు విషయానికొస్తే. ఒక గ్రాము కన్నా తక్కువే ఉంటాను. నేను ఎక్కువగా పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఉంటాను. నా జీవిత కాలం కూడా తక్కువే. గుడ్లు పెట్టగానే మేం చనిపోతాం. మాలో మగవి అంతకన్నా ముందుగానే ప్రాణాలు విడుస్తాయి. మమ్మల్ని చిన్న చిన్న చేపలు, ఇతర జీవులు ఆహారంగా తీసుకుంటాయి. సరే నేస్తాలూ..! ఉంటా మరి. ప్రస్తుతానికి ఇవే నా విశేషాలు!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
24సార్లు వినతిపత్రాలు ఇచ్చినా.. వందల సార్లు ఫిర్యాదుచేసినా..!
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ
-
Vizag: ‘విశాఖ వందనం’ పేరుతో రాజధాని హడావుడి
-
Drugs Case: నటుడు నవదీప్ ఫోన్లలో డేటా మాయం!
-
Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం