ఒక రోబో.. ఓ రూబిక్ క్యూబ్..!
అదో రంగు రంగుల గళ్ల ఆట వస్తువు. దాని పేరు రూబిక్ క్యూబ్. నిజానికి దాన్ని ఆటవస్తువు అనేకంటే.. పజిల్ అనడమే సబబు! మరి దీన్ని రోబోలు సాల్వ్ చేస్తే.. ‘ఊరుకోండి.. మన మనుషులకే చాలా కష్టం. ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ చేయలేం. అలాంటిది రోబోలు ఏం చేస్తాయి?’ అని అంటారేమో! కానీ రోబోలూ రూబిక్ క్యూబిక్‌ను ఓ ఆట ఆడించాయి.. ఆడిస్తున్నాయి. రికార్డుల మోత మోగిస్తున్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా!
రూబిక్ క్యూబ్ చూడ్డానికి కలర్‌ఫుల్‌గా బాగానే ఉంటుంది కానీ.. దీన్ని సాల్వ్ చేయాలంటేనే తలప్రాణం తోకకు వస్తుంది. కానీ కొంతమంది మాత్రం చకచకా వేళ్లను కదిపేస్తూ పరిష్కరిస్తుంటారు. కేవలం మనుషులేనా.. మేమూ ఈ పని చేయగలం అని కొన్ని రోబోలు నిరూపించాయి. అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాయి. ప్రపంచ రికార్డులనూ కొల్లగొట్టాయి. అమెరికాకు చెందిన బెన్‌కాట్జ్, జార్డ్ డి కార్లో అనే ఇద్దరు పరిశోధకులు కలిసి ఓ రోబోను రూపొందించారు. ఇది కేవలం 0.38 సెకన్లలోనే రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించింది. అంటే కనురెప్ప వేసేంతలోనే అన్నమాట! ప్రస్తుతం ఇదే అత్యుత్తమ రికార్డు. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కూడా సంపాదించింది. ఈ రోబోలో శక్తిమంతమైన మోటార్లను వాడారు. ఇవి కేవలం 10 మిల్లీ సెకన్ల సమయంలోనే రూబిక్ క్యూబ్‌ను ఒకసారి తిప్పగలవు. ఇంత వేగం ఉంది కాబట్టే కేవలం 0.38 సెకన్లలోనే రికార్డు సాధించింది.
ఇంతకు ముందు...
రికార్డుల ప్రకారం చూసుకుంటే ఒక మనిషి ఈ పనిచేయడానికి అతి తక్కువగా 4.69 సెకన్ల సమయం తీసుకుంది. బెన్‌కాట్జ్, జార్డ్ డి కార్లో రూపొందించిన రోబో ఈ 0.38 సెకన్ల రికార్డు సాధించడానికి కొన్ని సంవత్సరాల ముందు.. వేరే రోబో రూబిక్ క్యూబ్‌ను 0.637 సెకన్లలో పరిష్కరించింది. ఇలా ఇప్పటి వరకు ఓ ఏడు రోబోలు రూబిక్ క్యూబ్‌తో ఓ ఆటాడుకున్నాయి. మొత్తానికి ఇవీ విశేషాలు. ఏంటీ.. మీరూ రూబిక్ క్యూబ్‌ను ఓ పట్టుపట్టాలి అనుకుంటున్నారా నేస్తాలూ..! అయితే ఆల్ ది బెస్ట్!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!