గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా.. అనే నేను!
మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు.. కానీ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా గురించి విన్నారా? ‘అలాంటి గోడ కూడా ఉందా?’ అని ఆశ్చర్యపోతున్నారు కదా నేస్తాలూ! కానీ ఉంది.. ‘అవునా.. ఎక్కడ ఉందబ్బా?’ అని ఆలోచిస్తున్నారు కదూ! మీ చిట్టిబుర్రలకు ఎందుకంత శ్రమ. ఎంచక్కా ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ సమీపంలో కుంబల్‌ఘర్ అనే కోట ఉంది. దాని చుట్టూ ఆరావళీ పర్వతాల మీదుగా గోడ ఉంది. దాని పొడవు దాదాపు 36 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ. ఇది సముద్రమట్టానికి 1100 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గోడ కొన్ని చోట్ల చాలా వెడల్పుగా ఉంది. దాదాపు ఎనిమిది గుర్రాలు పరుగు తీసేంత స్థలం ఉంది.
చాలా ప్రాచీనం..
ఈ కోటగోడ చాలా ప్రాచీనమైంది. దీన్ని 15వ శతాబ్దంలో రాణా కుంభా నిర్మించారు. దీని నిర్మాణానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. ఇది శత్రుదుర్భేద్యమైంది. అప్పట్లో ఈ గోడ మీద పెద్ద పెద్ద దీపాలు వెలిగించేవారు. వాటికి 100 కేజీల పత్తి, 50 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని వాడేవారంట. అవి చాలా వెలుగును ఇచ్చేవంట. ఆ కాంతిలో రైతులు రాత్రిపూట తమ వ్యవసాయ పనులు చేసుకునేవారంట.
మేఘాలను తాకేలా..!
ఈ కోటలో బాదల్‌మహల్ అనే నిర్మాణం ఉంది. ఇది అత్యంత ఎత్తులో ఉంటుంది. అక్కడికెళ్లి చూస్తే కోట మొత్తం కనిపించేదంట. బాదల్ మహల్ కిటికీలను తెరిచి చూస్తే మేఘాలు మన కళ్లముందు నుంచి ప్రయాణిస్తున్నట్లే ఉంటుందంట. ఇంతటి అద్భుత నిర్మాణానికి 2013లో యునెస్కో గుర్తింపు లభించింది. ఈ కోటలో వందల సంఖ్యలో ఆలయాలు, ఇతర నిర్మాణాలూ ఉన్నాయి. వీటిని చూడటానికి దేశ, విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నేస్తాలూ... ఇవీ ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ విశేషాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Mossad: ఇరాన్ క్షిపణి స్థావరంపై మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్..!
-
Politics News
nara lokesh-yuvagalam: కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?: నారా లోకేశ్
-
Sports News
Hardik: ధోనీ పోషించిన బాధ్యత నాపై ఉంది.. ఒక్కోసారి కాస్త నిదానం తప్పదు: హార్దిక్
-
Movies News
Social Look: క్యాప్షన్లేని రష్మిక ఫొటోలు.. కేతిక ‘ఫిబ్రవరి ఫీల్స్’!
-
Politics News
Yuvagalam-Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర.. ప్రచారరథం సీజ్ చేసిన పోలీసులు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ వచ్చేసింది.. దరఖాస్తు చేశారా?