నరకపు దారిలో.. స్వర్గానికి మెట్లు!
‘‘ఏంటి..? నేస్తాలూ! మొహం అలా ప్రశ్నార్థకంగా పెట్టారు. మీ అనుమానం అర్థమైందిలే.. ‘ఈ చిన్నూ ఉత్త చేతులతో రాడు. ఎప్పుడు వచ్చినా ఏవో వింత, కొత్త విషయాలను మోసుకొస్తాడు. కానీ ఈ సారి ‘నరకపు దారిలో స్వర్గానికి మెట్లు’ అంటూ గందరగోళానికి గురి చేస్తున్నాడు’’ అనుకుంటున్నారు కదూ! ఇంతకీ విషయం ఏంటంటే ఫ్రెండ్స్..!
ఇక్కడ చిత్రంలో పచ్చని పర్వతం మీద సన్నగా.. పొడవుగా.. పాములా మెలికలు తిరిగి అత్యంత ప్రమాదకరంగా ఉన్న మెట్లు కనిపిస్తున్నాయిగా... వీటినే హైకూ మెట్లు అంటారు. ‘స్వర్గానికి మెట్ల మార్గం’ (స్టైర్ వే టూ హెవెన్) అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఇవి ఎక్కడున్నాయో తెలుసా.. హవాయి ద్వీప సముదాయంలోని ఓహు ద్వీపంలోని పర్వతం మీద. పదో.. ఇరవయ్యో కాదు.. వందో.. వెయ్యో కూడా కాదు.. ఏకంగా 3,922 మెట్లున్నాయి. అన్ని మెట్లు ఎందుకు? ఎవరు నిర్మించారు అంటే..
రేడియో స్టేషన్ కోసం..
పర్వతం మీద అన్ని మెట్లను రేడియో స్టేషన్ కోసం ఏర్పాటు చేశారు. ఏంటి రేడియో స్టేషన్ కోసమా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో.. అంటే 1942 ప్రాంతంలో లేదు. అందుకే ఎత్తైన పర్వతం మీద కట్టారు. మరో విషయం ఏంటంటే.. అది వినోద కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్ కాదు. అమెరికా నావికాదళం కోసం నిర్మించింది. ఇది 1943 నుంచి అందుబాటులోకి వచ్చింది.
అనుమతి లేదు..
1950లలో చెక్క మెట్ల స్థానంలో ఇనుప మెట్లను ఏర్పాటు చేశారు. 1970 నుంచి ఇక్కడి రేడియోస్టేషన్ సేవలు నిలిచిపోయాయి. 1987 నుంచి ఇక్కడికి ప్రజలను అనుమతించడం మానేశారు. 2003లో పర్యాటకులకు అనుమతి ఇద్దామనుకున్నారు... కానీ ఇవ్వలేదు. ఇప్పటికీ కొంతమంది అక్రమంగా ఈ మెట్లను ఎక్కడానికి వస్తుంటారు. ఇలా వచ్చి జైలు శిక్షలు అనుభవించిన వారూ ఉన్నారు. అయినా.. ఈ మెట్ల మార్గంలో నడిస్తే వచ్చే థ్రిల్ కోసం సాహసాలు చేస్తుంటారు.
మెట్లు ఉండవిక..
గత చరిత్రకు చిహ్నంగా ఉన్న మెట్లను భవిష్యత్తులో చూడలేం. కొన్ని కారణాల వల్ల వీటిని తొలగించాలని సెప్టెంబర్ నెలలో స్థానిక అధికారులు తీర్మానించారు. దీనంతటికీ కొన్ని నెలల సమయం పట్టనుంది. ఇదే జరిగితే 2022లో ఈ మెట్లు ఇక కనిపించవు. మొత్తానికి ఇవీ నేస్తాలూ! స్వర్గపు మెట్ల సంగతులు.
అదిగో మా అమ్మ కూడా పిలుస్తోంది. ఈసారి వచ్చేటప్పుడు మరింత వింత సంగతి మోసుకు వస్తాను సరేనా! ఇప్పటికైతే ఉంటామరి.. బై..బై!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!