తాతయ్యకు ప్రేమతో.. రైతన్నకు భక్తితో..

ఓ నేస్తం రైతులకోసం ఆలోచించింది. వాళ్ల సమస్యకు పరిష్కారం చూపి అవార్డునూ సొంతం చేసుకుంది. ఆ నేస్తమెవరు? ఏం చేసింది? తెలుసుకుందామా!

Published : 11 Oct 2021 01:22 IST

ఓ నేస్తం రైతులకోసం ఆలోచించింది. వాళ్ల సమస్యకు పరిష్కారం చూపి అవార్డునూ సొంతం చేసుకుంది. ఆ నేస్తమెవరు? ఏం చేసింది? తెలుసుకుందామా!

నేహ భట్‌. వయసు 15 ఏళ్లు. ఉండేది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది.

అధ్యయనం చేసింది.

నేహది వ్యవసాయ కుటుంబం. ఆ చుట్టు పక్కల అందరికీ కూడా వక్క పంటనే జీవనాధారం. అయితే ఆ పంటకు తెగులు వచ్చినప్పుడల్లా రసాయనాలు చల్లేవారు. అయితే వాటివల్ల రైతులు ఎంతోమంది అనారోగ్యం పాలయ్యి ప్రాణాలు కోల్పోయేవారు. నేహ వాళ్ల తాతయ్య కూడా ఇలానే అనారోగ్యంతో బాధపడేవారు. అది చూసిన నేహకు అసలు కారణమేంటో తెలుసుకోవాలని రైతులందరినీ కలిసి పంట గురించి, వాళ్లు వాడే రసాయనాల గురించి, అధ్యయనం చేసింది. స్ప్రేకు వాళ్లు వాడేది బోర్డోమిక్స్‌ అనే ద్రావణం. ఇది చాలా ప్రమాదకరమైన రసాయనం. దీన్ని స్ప్రేయర్‌లో పోసి ఒంటికి తగిలించుకుని కొట్టడంతో అది ఒంటిమీద పడి ఎన్నో రోగాలకు కారణమవుతోంది. ఇది తెలుసుకున్న నేహ వీళ్లకోసం బుడతా భక్తిగా ఏదైనా చేయాలనుకుంది.


ఆలోచనే.. ఆచరణ దిశగా..

ఇంతలో తను చదివే స్కూల్‌లో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ వాళ్లు ఇన్నోవేటివ్‌ ప్రోగ్రాంకు సంబంధించిన వర్క్‌షాప్‌ నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులను తమకు తోచిన ఐడియాతో ప్రాజెక్టు చేయమని చెప్పారు. అప్పటికే నేహ మనసులో రైతుల సమస్య గురించి ఆలోచన ఉంది కాబట్టి దాని మీదనే ప్రాజెక్టు చేద్దామనుకుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇందుకు సహకరించారు. అలా రైతులకోసం ‘ఆటోమేటిక్‌ స్ప్రేయర్‌ మెషిన్‌’ను కనిపెట్టింది. దీని ద్వారా సులువుగా పొలమంతా స్ప్రే చేయొచ్చు. దీంతో సమయం ఆదా అవడంతో పాటు రైతులకు ఎలాంటి అపాయం కలగదు. తన ప్రాజెక్టు చూసిన అందరూ నేహ మీద ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు.. నేహ యంగ్‌ ఇన్నోవేటర్‌ అవార్డును గెలుచుకుంది. దీనికి గానూ 30 వేల రూపాయల నగదు బహుమతీ సొంతం చేసుకుంది. ్త్చ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని