యో..యో.. లియో..!
హాయ్ నేస్తాలూ.. బాగున్నారా.. నా పేరు లియోనార్డో.. నన్ను ముద్దుగా లియో అని పిలుస్తారు.. నేనో రోబోను.. బుజ్జి రోబోను.. నా గురించి మరిన్ని వివరాలు కావాలా మీకు..హుమ్! అవి చెబుదామనే ఇదిగో.. ఇలా వచ్చా..
‘ఆ.. రోబో.. అయితే ఏంటి.. ఇలాంటి రోబోలను ఎన్నింటినో చూశాం..’ అని మీలో కొంతమంది ఇప్పటికే అనుకుని ఉంటారు. కానీ నేను అలాంటి ఇలాంటి రోబోను కాదు. సూపర్ రోబోను. నేను గాల్లో ఎగరగలను.. నేలమీదా నడవగలను.. అంతెందుకు స్కేటింగ్ కూడా చేయగలను.. మీరు నోరెళ్లబెట్టి అవాక్కయ్యే విషయం మరోటి చెప్పనా..! నేను ఏకంగా తాడు మీద కూడా నడవగలను..!
గట్టి.. గట్టి.. రోబో!
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) పరిశోధకులు నాకు ప్రాణం పోశారు. నిజానికి నాలా తక్కువ బరువుండే రోబోలను సృష్టించి వాటితో నడిపించాలంటే చాలా కష్టం. ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వక పడిపోతుంటాయి. కానీ కాల్‌టెక్ వాళ్లకు ప్రొఫెల్లర్లు ఈ సమస్యకు పరిష్కారం చూపాయి. అవే నన్ను డ్రోన్‌లా ఎగిరేలానూ చేశాయి.
భలే.. భలే.. బ్యాలెన్సోయ్!
కేవలం 75 సెంటీమీటర్ల ఎత్తుతో 2.58 కిలోల బరువుతో మరగుజ్జులా ఉండే నేను బ్యాలెన్స్ విషయంలో మాత్రం అదుర్స్! కెమెరాలు, సెన్సర్ల సాయంతో నేను చక్కగా నడుస్తాను.. ప్రొఫెల్లర్ల నుంచి వచ్చే గాలితో ఎంచక్కా పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటాను. స్కేట్‌బోర్డింగ్, తాడుపై నడక, గాల్లో ఎగరడం ఇవన్నీ ఈ మూడింటి సమన్వయంతోనే జరుగుతుంది. మరో విషయం ఏంటంటే మల్టీ జాయింట్ లెగ్స్ ఉన్న మొట్టమొదటి రోబోను కూడా నేనే. కానీ ప్రస్తుతానికి ఇంకా ప్రయోగ దశలో ఉన్నాను. అయితేనేం ఇప్పటికే ఎన్నో పనులు చకచకా చేసేస్తున్నాను. ఇంతకీ నన్ను తయారు చేయడానికి స్ఫూర్తి ఎవరో చెప్పనే లేదు కదూ.. పక్షులే! అవును పక్షులే.. ఎందుకంటే అవి ఎంచక్కా గాల్లోనూ ఎగురుతాయి. నేలమీద కూడా నడవగలవు. వాటిని చూసే పరిశోధకులు నన్ను తయారు చేశారు.
ఎన్నో పనులు చక్కబెట్టేస్తా..
మీ మనుషులు చేయలేని, చేయడానికి కష్టమయ్యే, ప్రమాదంతో కూడుకున్న చాలా పనులను నేను చిటికెలో చేసేయ్యగలను. హైవోల్టోజ్ విద్యుత్తు లైన్లలో ఏమైనా సమస్యలొచ్చినా మరమ్మతులు చేసేస్తాను. అంతరిక్ష యాత్రలోనూ మీకు చేదోడువాదోడుగా ఉంటాను. ఫుడ్ డెలివరీ, యుద్ధంలో సైనికులకు మందుల సరఫరా, ఇంట్లో రోజువారీ పనులు... ఇలా మీకు నేను చాలా విషయాల్లో సాయపడగలను. నన్ను ఎంతగా అభివృద్ధి చేస్తే.. అంతగా మీకు పనులు చేసి పెడతానన్నమాట. ప్రస్తుతానికి ఇవీ సంగతులు. ఇప్పటికైతే ఉంటా మరి.. ఎందుకంటారేంటి... బ్యాటరీ కాస్త వీకైపోయింది.. ఛార్జింగ్ పెట్టుకోవాలిగా మరి.. బై.. బై..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: గంటల వ్యవధిలో.. తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
World News
Earthquake: అతి తీవ్రమైన ఐదు భూకంపాలివే..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
KVS Admit cards: కేవీల్లో ఉద్యోగాలకు పరీక్ష రేపట్నుంచే.. అడ్మిట్ కార్డులు పొందండిలా..
-
General News
Parliament: తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు: కేంద్రం