చిట్టి బుర్రలో... గట్టి ఆవిష్కరణలు!
ఇద్దరు నేస్తాలు తమ ఆవిష్కరణలతో అందరినీ అబ్బుర పరిచారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున తమ ప్రతిభతో ఔరా అనిపించారు. ఆ నేస్తాలెవరో.. ఏం చేశారో.. తెలుసుకుందామా!
అక్టోబరు 30న అంతర్జాతీయ బాలికల దినోత్సవం కదా! ఆ సందర్భంగా జాతీయ స్థాయిలో ‘యంగిస్తాన్ ఫౌండేషన్’ చిన్నారులకు ‘డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్’ కార్యక్రమం నిర్వహించింది. దీన్ని ఆన్లైన్ వేదికగా ఏర్పాటు చేశారు. ఇందులో వందల సంఖ్యలో విద్యార్థినులు పోటీపడగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు నేస్తాలు తమ వినూత్న ఆవిష్కరణలతో ప్రశంసలు అందుకున్నారు. వాళ్లలో ఒకరు జనంపల్లి రూప. వయసు 14 ఏళ్లు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అంబర్ పేట్లో తొమ్మిదో తరగతి చదువుతోంది.
పాలు పొంగవిక!
పాలు వేడిచేయడం తేలికే! కానీ కాస్త ఏమరపాటుగా ఉంటే, క్షణాల్లో పాలు పొంగి పొయ్యంతా అవుతాయి. అరెరె, ఇక్కడే ఉన్నా కూడా పొంగి పొయాయే అని అమ్మ అనుకోవడం మన ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం. కానీ ఈ నేస్తం పాలు పొంగిపోవడమంటే, కొంత పాలు వృథా అవుతున్నట్లే కదా! అని, పైగా పొయ్యిలోకి చేరి, పొయ్యి పాడవుతుందని గ్రహించి ఏకంగా పరిష్కారం కనిపెట్టింది. పాలపొంగును నిరోధించడానికి ‘బాయిలింగ్ మిల్క్ ఓవర్‌ఫ్లో ప్రివెన్షన్ సిస్టమ్’ను తయారు చేసింది. అలారం ట్రిగ్గర్, వంట పాత్ర ఇందులో భాగమై ఉంటాయి. పాలు పొంగే సమయంలో అలారం మోగి, అందరినీ అప్రమత్తమయ్యేట్టు చేస్తుంది.
ఈ ప్రయోగం కోసం లిక్విడ్ సెన్సార్స్, బజర్, బ్యాటరీలు, పవర్ సర్క్యూట్లను తీసుకోవాలి. లిక్విడ్ సెన్సార్‌ను పాలు వేడిచేస్తున్న పాత్ర పై భాగంలో ఉంచాలి. ఈ సెన్సార్‌ను బజర్‌కు కనెక్ట్ చేయాలి. పాలు పొంగి సెన్సార్లను తాకిన వెంటనే శబ్దం వస్తుంది. దీంతో అప్రమత్తమై పాలు పొంగకుండా చూసుకోవచ్చు. తెలుసా! ఈ పరికరాన్ని తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఇక ఇదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని. అంగోతు జయంతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏడో తరగతి చదువుతోంది.
చల్లదనాన్ని ఇచ్చే హెల్మెట్
ఈరోజుల్లో హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కానీ ఎండ, వేడి కారణంగా పుట్టే చెమట, చికాకు వల్ల దాన్ని ఎవరూ ధరించడానికి ఇష్టపడటం లేదు. ఇది గమనించిన ఈ నేస్తం సోలార్ హెల్మెట్‌ను కనిపెట్టింది. ఇందుకు సోలార్ ప్యానెల్, వైర్ కనెక్షన్, బ్యాటరీల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా తెలుసుకుంది. ఆపై కూలర్లా పనిచేసే సోలార్ హెల్మెట్‌ను, దాంట్లో భాగంగా ఉండే ఓ టార్చ్‌ను తయారు చేసింది. వీధి దీపాలు లేనిచోట ఈ లైటు సహాయపడుతుందని చెబుతోంది. ఎండవేడిమి నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని కూడా వివరించింది. ఈ హెల్మెట్‌కు ప్రత్యేకంగా బ్యాటరీ ఛార్జ్ ఇవ్వాల్సినవసరం లేదు. సోలార్ ప్యానెల్ ఎండను నేరుగా గ్రహించి, బ్యాటరీ సాయంతో నడుస్తుంది.
ఇలా ఈ ఇద్దరు నేస్తాలూ తమ ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఆలోచించాలే గానీ ఐడియాలు ఎందుకురావు అంటున్నారీ నేస్తాలు. అంతేగా! మరి ఇక నేస్తాల ఇద్దరికీ అభినందనలు తెలిపేయండి.
- పొట్టబత్తిని రాజ్యలక్ష్మి, ఈనాడు డిజిటల్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!