రయ్‌.. మంటూ రికార్డు కొట్టింది

ఓ చిన్నారి సైక్లింగ్‌లో సత్తా చాటుతోంది. చిన్నవయసులోనే రికార్డులు అందుకుంటూ ప్రశంసలు పొందుతోంది. ఆ చిన్నారి ఎవరో ఏంటో తెలుసుకుందాం రండి.

Published : 08 Nov 2021 00:07 IST

ఓ చిన్నారి సైక్లింగ్‌లో సత్తా చాటుతోంది. చిన్నవయసులోనే రికార్డులు అందుకుంటూ ప్రశంసలు పొందుతోంది. ఆ చిన్నారి ఎవరో ఏంటో తెలుసుకుందాం రండి.

ఆ చిన్నారి పేరు స్వర యోగేష్‌ భగవత్‌. వయసు ఆరేళ్లు. స్వస్థలం మహారాష్ట్రలోని గోఖ్లీ గ్రామం.

ఆసక్తితోనే అడుగు..

స్వర చిన్నప్పట్నుంచీ చురుకే. ఏది చెప్పినా ఇట్టే నేర్చుకుంటుంది. తన ఆసక్తితోనే సైక్లింగ్‌ నేర్పించారు అమ్మానాన్న. రోజూ సరదాగా సైక్లింగ్‌ చేసేది. అయితే తను వెళ్లే స్పీడు చూశాక అందులోనే స్వర ప్రతిభను వెలికితీయాలనుకున్నారు. అప్పట్నుంచి సైక్లింగ్‌లో మెలకువలు చెబుతూ సమయాన్ని నిర్దేశిస్తూ శిక్షణ ఇచ్చేవారు అమ్మానాన్న.

ప్రపంచ రికార్డు సొంతం..

స్వర.. నిత్యం సాధన చేస్తూ సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకుంది. 12 గంటల్లో 143 కి.మీ. సైక్లింగ్‌తో ‘ఔరా’ అనిపించింది. అంతేకాదు తన ప్రతిభతో సైక్లింగ్‌లో ‘వరల్డ్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ ఇండియా’లో స్థానం సంపాదించుకుంది. నిజంగా ఇంత చిన్నవయసులో అంత ఘనత సాధించడం అంటే స్వర నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని