తనలాంటి వారికోసం..
ఓ అక్క తను చేసిన ప్రాజెక్టు ద్వారా గ్లోబల్ అవార్డు దక్కించుకుంది. అందరితో ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఆ అక్క ఎవరు? ఏం చేసిందో తెలియాలంటే చదవాల్సిందే!
బెంగళూరుకి చెందిన కావ్య జానకి ముండ్కూర్ వయసు 18 ఏళ్లు. ఇంటర్ చదువుతోంది. ఏటా ‘గ్లోబల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే సంస్థ గ్లోబల్ అవార్డులు ఇస్తుంటుంది. ఈ ఏడాది కూడా అలానే పోటీలు నిర్వహించింది. అయితే దీనికి వేలమంది పోటీపడ్డారు. అందులో 100మంది అవార్డులను అందుకున్నారు. అందులో కావ్య కూడా గ్లోబల్ అవార్డు దక్కించుకుంది. కావ్యకెలా ఈ అవార్డు దక్కిందనే సందేహం రావొచ్చు. ఈ గ్లోబల్ పోటీలకు కళాశాల విద్యార్థులు కూడా పోటీపడ్డారు. తమ ప్రాజెక్టుల ద్వారా ప్రతిభను వెలికితీశారు. అలా మన కావ్య మానసిక ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద ‘కారా’ అనే ప్రాజెక్టు చేసింది. అంటే మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్లు ఆత్మ న్యూనతకు గురవుతూ ఉంటారు కదా! అయితే అదేదో పెద్ద జబ్బు అన్నట్టు ఫీలవుతుంటారు. దాంతో మరింత కుంగిపోయి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాంటి వాళ్లలో చైతన్యం తీసుకురావడమే కావ్య ప్రాజెక్టు ఉద్దేశం. అంతేకాదు తన ప్రాజెక్టులో భాగంగా ఇలా బాధపడుతున్న వాళ్లను మూమూలు స్థితికి తీసుకు వచ్చేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని అనుకుంటుంది. అందుకోసం ఫండ్ కూడా త్వరలో కలెక్ట్ చేస్తాననీ చెబుతోంది. తను ప్రజెంట్ చేసిన విధానం నచ్చడంతో కావ్య ప్రాజెక్టుకు గ్లోబల్ అవార్డు ఇచ్చేశారు.
భరోసా ఇస్తే చాలు!
కావ్య కూడా మొదట మానసికంగా బలహీనంగా ఉండేది. బయటకు వెళ్లినప్పుడు అందరూ తనను వింతగా చూసేవారు. అయితే తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన భరోసాతో తనలో మార్పు వచ్చింది. అయితే తనకు ఎదురైన చేదు అనుభవాలు ఇంకెవరూ ఎదుర్కోకూడదని అనుకుంది. తను అనుకున్నది ఈ ప్రాజెక్టు రూపంలో తెలియజేసే అవకాశం వచ్చింది. దీనిద్వారా తన కుటుంబమంతా తనకు ఎలా అయితే మద్దతుగా ఉన్నారో అలానే మిగతా వాళ్లకు కూడా ఉంటే ఎవరూ బాధపడరనీ, ఎటువంటి మందులూ లేకుండానే మానసికంగా బలంగా అయ్యేలా చేయొచ్చని చెబుతోంది. అక్క నిజంగా గ్రేట్ కదా! ఇంకేం అక్కకు అభినందనలు తెలిపేయండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
INS Vikrant: ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై యుద్ధవిమానం ల్యాండింగ్
-
Politics News
TS Budget: తెలంగాణ బడ్జెట్.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే: బండి సంజయ్
-
General News
Supreme court: ఎఫ్డీలను జప్తు చేశారో? లేదో? వివరాలివ్వండి: భారతీ సిమెంట్స్‌కు సుప్రీం ఆదేశం
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Crime News
Crime news: ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి బలవన్మరణం
-
Movies News
Anupam Kher: టాలెంట్ కంటే హెయిర్ స్టైల్ ముఖ్యమని అప్పుడర్థమైంది: అనుపమ్