చిన్నారి ఆలోచన భళా!
మన తెలుగు నేస్తం అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకుంది. పెద్దవాళ్లే తలలు పట్టుకున్న సమస్యను ఎలా పరిష్కరించవచ్చో చెప్పి ప్రశంసలు అందుకుంది. ఆ నేస్తమెవరు? ఏం చేసింది? ఆ వివరాలు మీకోసం..
కొసరాజు రేష్మా, వయసు 15 ఏళ్లు. తెలుగమ్మాయే అయినా కొన్నాళ్లుగా వీళ్ల కుటుంబం కాలిఫోర్నియాలోని సరటోగా నగరంలో స్థిరపడింది.
అవార్డు అందుకుంది..
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకోసం పాటు పడే బాలలకు ‘చిల్డ్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్’ ప్రతి ఏడాది అవార్డులు అందిస్తోంది. అలా ఈ ఏడాది చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్-2021’కి మన రేష్మాను ఎంపిక చేశారు.
ఇంతకీ ఏం చేసింది?
అడవుల్ని కాల్చి బూడిద చేస్తున్న కార్చిచ్చు గురించి వినే ఉంటారు. ఎన్నో హెక్టార్ల అడవులు ఈ కార్చిచ్చుకు ఆహుతవుతున్నాయి. ఎన్నో వన్యప్రాణుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పర్యావరణం దెబ్బతింటుంది. కాలుష్యం వల్ల ఏటా 3 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ పెనుముప్పును తప్పించడం ఎలానో ఎవరికీ తెలీడంలేదు. అసలేం చేయాలో ఎవరికీ అంతుచిక్కడంలేదు. అయితే రేష్మా కూడా దీని గురించి ఆలోచించింది. అడవులన్నీ కాలిపోతూ మూగజీవాలు బూడిదవుతుంటే చూడలేకపోయింది. ఈ సమస్య గురించి ఎంతో ఆలోచించి దీనికో పరిష్కారం కనిపెట్టింది. అదేంటంటే కార్చిచ్చులను ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో ముందుగానే పసిగట్టొచ్చు అని తెలియజెప్పింది. ఈ విధానం ద్వారా 90 శాతం కార్చిచ్చులను ముందుగానే తెలుసుకోవచ్చు అని ప్రయోగాత్మకంగా తెలియజేసింది. దీంతో రేష్మా తెలివికి, ఆలోచనా విధానానికి అందరూ ప్రశంసలు కురిపించారు. తన ఐడియాకు మెచ్చుకుంటూ ‘చిల్డ్రన్స్ క్లైమేట్ ఫ్రైజ్-2021’ అవార్డుకు ఎంపిక చేశారు. నిజంగా నేస్తం గ్రేట్ కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’