బెకబెక.. భౌభౌ.. బుస్‌బుస్‌..!

ఏంటీ కప్పలు, కుక్కలు, పాముల శబ్దాలు అనుకుంటున్నారా? ఇలా కొన్ని జీవుల శబ్దాలనైతే టక్కున గుర్తుపట్టేస్తాం కదా. కానీ మనం గుర్తుపట్టలేని జంతువుల శబ్దాలు....

Published : 27 Nov 2021 00:48 IST

ఏంటీ కప్పలు, కుక్కలు, పాముల శబ్దాలు అనుకుంటున్నారా? ఇలా కొన్ని జీవుల శబ్దాలనైతే టక్కున గుర్తుపట్టేస్తాం కదా. కానీ మనం గుర్తుపట్టలేని జంతువుల శబ్దాలు కూడా ఓ నేస్తం చెప్పేస్తుంది. తన ప్రతిభతో రికార్డులు కొట్టేస్తుంది. తనెవరో ఏంటో తెలుసుకుందాం రండి..

మిళనాడుకు చెందిన తనిష్క, వయసు నాలుగేళ్లు. తనిష్కకు జంతువులంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా జంతువులకు సంబంధించిన ఛానెల్స్‌ చూసేది. వాటి అరుపులను విని అవెలా అరుస్తాయో అమ్మానాన్నలకు చేసి చూపించేది.

అమ్మానాన్న ప్రోత్సాహంతో..
తను అలా జంతువుల శబ్దాలు చెప్పడం గమనించిన అమ్మానాన్న.. తన ప్రతిభను నలుగురికీ తెలియచేయాలనుకున్నారు. మిగతా జంతువులు ఎలా అరుస్తాయో వీడియోల్లో చూపించేవారు. అలా ఏ జంతువు ఎలా అరుస్తుందో తనకు అవగాహన తెప్పించారు. తర్వాత తన ప్రతిభను అందరికీ తెలియజేసేందుకు రికార్డ్స్‌ కమ్యూనిటీకి మన తనిష్క గురించి తెలియజేశారు అమ్మానాన్న. తర్వాత తనిష్క.అందరిముందూ 48 జంతువుల శబ్దాలను ఒక్క నిమిషంలో చెప్పేసింది. చిన్న వయసులోనే అంతటి జ్ఞాపకశక్తి, ప్రతిభను సొంతం చేసుకున్న తనిష్కను అందరూ మెచ్చుకున్నారు. అంతేకాదు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో తనిష్క పేరు నమోదుచేసేశారు. నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ! మరింకేం తనిష్కకు అభినందనలు తెలిపేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని