ప్రతిభతో పతకాలు..

సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమెలానో ఈ నేస్తం చెబుతోంది. ఖాళీ సమయాన్ని వృథాగా పోనివ్వకుండా అన్ని కళల్లో ఆసక్తి కనబరిచింది. అంతేనా.. తన ప్రతిభతో రికార్డులూ సాధిస్తోంది. ఇంతకీ ఎవరా నేస్తం.. తెలుసుకునేందుకు చదివేయండి..

Published : 15 Jan 2022 01:04 IST

సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమెలానో ఈ నేస్తం చెబుతోంది. ఖాళీ సమయాన్ని వృథాగా పోనివ్వకుండా అన్ని కళల్లో ఆసక్తి కనబరిచింది. అంతేనా.. తన ప్రతిభతో రికార్డులూ సాధిస్తోంది. ఇంతకీ ఎవరా నేస్తం.. తెలుసుకునేందుకు చదివేయండి..

శస్వి అనుమోతు. వయసు 14 సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఆసక్తితో అడుగు..

లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు అయిపోగానే యశస్వి తన ప్రతిభకు పదునుపెట్టింది. చెస్‌, డ్రాయింగ్‌, కూచిపూడి నృత్యం, అన్నమాచార్య కీర్తనలు ఇలా అన్నింటిని ఫోన్‌లో వీడియోలు చూస్తూ తనకు తానుగా నేర్చుకుంది. అంతేకాదు యూట్యూబర్‌గా మారి డాన్స్‌, పెయింటింగ్‌, పాటలు, శ్లోకాలు పాడుతూ వీడియోలు చేసేది. అలాగే హూలాహుప్‌ ఆడుతూ రూబిక్‌ క్యూబ్స్‌ సాల్వ్‌ చేయడం నేర్చుకుంది.

బహుమతులు బోలెడు..

కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్‌ క్యూబ్‌ను సాల్వ్‌ చేయడంలో శిక్షణ తీసుకుంది. అందులో నైపుణ్యత సాధించి 11 రూబిక్‌ క్యూబ్లను 7 నిమిషాల 36 సెకన్లలో సాల్వ్‌ చేసి రికార్డుల్లోకి ఎక్కేసింది. చిత్రలేఖనంలో కూడా ఎన్నో పతకాలు, ప్రశంసలు, బహుమతులూ అందుకుంది. యశస్వి ప్రతిభకు గానూ ఇప్పటివరకూ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఓఎమ్‌జీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంకా నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించేసింది. వీటితో పాటుగా పర్యావరణ మిత్ర అవార్డు, ఇండియా స్టార్‌ ఐకాన్‌ కిడ్స్‌ అచీవర్స్‌ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు అటు చదువులోనూ ప్రతిభ కనబరుస్తుంది.  ఆసక్తి ఉండాలేగానీ.. ఏదైనా సాధించవచ్చని నిరూపించింది కదా.. మన నేస్తం. మరింకేం యశస్వికి అభినందనలు తెలిపేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని