బొమ్మల్లో ఏముంది?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయగలరా?

Updated : 22 May 2022 01:32 IST

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న గడుల్లో రాయగలరా?


చెప్పుకోండి చూద్దాం?

1. అందచందాల వాడు.. రోజుకో ఆకారం.. చివరికి నిరాకారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

2. అక్కాచెల్లెలి అనుబంధం.. ఇరుగూ పొరుగూ సంబంధం.. దగ్గర ఉన్నా చేరువ కాలేరు. ఏంటో తెలుసా?

3. ఆ పక్క చూస్తే ఎర్ర టోపీ, ఈ పక్క చూస్తే నల్ల టోపీ. ఇంతకీ నేనెవరు?

4. తోడేవారే కానీ, పోసేవారే లేరు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు

1. ప్రాణం తీసే హారం?

2. స్వాగతం పలికే రణం?

3. ఎంత విసిరినా అక్కడే తిరిగే రాయి?


రాయగలరా?

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలు రాయాలి. అప్పుడు అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి నాలుగక్షరాలు ‘కోట’ అనీ.. 1, 2, 7 అక్షరాలు కలిస్తే ‘మంచం’ అనీ అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. మధ్యలోని మూడక్షరాలు కలిస్తే ‘తిన్నా’ అనే అర్థాన్నిస్తాయి. 5, 2, 3 అక్షరాలు ఎలుకని సూచిస్తాయి. నేను ఎవరో చెప్పగలరా?


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



నేను గీసిన చిత్రం


జవాబులు

బొమ్మల్లో ఏముంది: 1.పాలకోవా 2.పాఠశాల 3.కోడిపెట్ట 4.పెసరట్టు 5.మామిడిచెట్టు

చెప్పుకోండి చూద్దాం?: 1.చందమామ 2.కళ్లు 3.గురివింద గింజ 4.బావినీరు

తమాషా ప్రశ్నలు: 1.సంహారం 2.తోరణం 3.విసుర్రాయి

రాయగలరా?: 1.నురుగు  2.పెరుగు  3.మరుగు  4.జరుగు  5.మెరుగు  6.మురుగు  7.మొరుగు  8.కరుగు  9.పురుగు  10.సొరుగు

నేనెవర్ని: 1. COMFORT   2. LATER  అది ఏది: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు