నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ‘చరిత్రలో మన పేరు లిఖించబడాలంటే ఏం చేయాలి?’

Updated : 21 Jun 2022 00:41 IST

నిజమే సుమీ!

టీచర్‌: ‘చరిత్రలో మన పేరు లిఖించబడాలంటే ఏం చేయాలి?’

చింటు: ముందు మన పేరు మనం రాసుకోవడం నేర్చుకుని ఉండాలి టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


నాన్నకు ప్రేమతో..

టీచర్‌: తరుణ్‌.. నీ ప్రోగ్రెస్‌ కార్డు మీద మీ నాన్న సంతకం ఏదీ?

తరుణ్‌: మా నాన్న సంతకం పెట్టనన్నారు టీచర్‌.

టీచర్‌: ఏ.. ఎందుకు?

తరుణ్‌: మా నాన్నకు కాస్త పౌరుషం ఎక్కువ టీచర్‌. నేను అంత తక్కువ మార్కులు తెచ్చుకుంటే... ఆయనెలా సంతకం పెడతారు టీచర్‌!


అమ్మా ప్లీజ్‌..

ప్రియాంక: అమ్మా.. నాకు ఆ డోలు కొనియ్యవా..ఆడుకుంటాను.

అమ్మ: అమ్మో.. ఇంకేమైనా ఉందా.. ఆ చప్పుళ్లతో మాకసలు ప్రశాంతత లేకుండా పోతుంది.

ప్రియాంక: అందుకే అమ్మా.. రాత్రిపూట మీరందరూ పడుకున్నాకే.. నేను ఆ డోలుతో ఆడుకుంటా.. ప్లీజ్‌ అమ్మా.. కొనివ్వు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని