నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ఏంటి చింటూ.. ఈ మధ్య తెగ అబద్ధాలు ఆడుతున్నావు?

Published : 23 Jun 2022 00:39 IST

మీరే.. నిప్పన్నారని..

టీచర్‌: ఏంటి చింటూ.. ఈ మధ్య తెగ అబద్ధాలు ఆడుతున్నావు?
చింటు: మొన్న మీరే చెప్పారు కదా టీచర్‌. నిజం.. నిప్పులాంటిదని!

టీచర్‌: ఆఁ!! చెప్పాను అయితే...!
చింటు: మరి నిప్పు కాలుతుంది కదా టీచర్‌.. అందుకే అబద్ధాలు ఆడుతున్నా.

టీచర్‌: ఆఁ!!

అది నిజం.. ఇది అబద్ధం!

టీచర్‌: ‘సూర్యుడు తూర్పున ఉదయించి.. పడమరన అస్తమిస్తాడన్నది ఎంత నిజమో..’ ఈ వాక్యాన్ని పూర్తి చేయి టింకూ.
టింకు: సూర్యుడు పడమరన ఉదయించి.. తూర్పున అస్తమిస్తాడన్నది కూడా అంతే అబద్ధం... టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

అది మీదే నాన్నా...

నాన్న: ఏంటి మధూ.. నీకు ఎగ్జామ్స్‌లో ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయి. తెలుగులో పది, హిందీలో అయిదు, మ్యాథ్స్‌లో మూడు....
మధు: సరిగా చూడండి నాన్నా... అది నీ ప్రోగ్రెస్‌ కార్డే.. నిన్న నాకు స్టోర్‌ రూం సెల్ఫ్‌లో దొరికింది.

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని