నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: మీ ఇంట్లో నాలుగు యాపిల్స్‌ ఉన్నాయనుకో...

Published : 27 Jun 2022 01:13 IST

దటీజ్‌ టింకూ!

టీచర్‌: మీ ఇంట్లో నాలుగు యాపిల్స్‌ ఉన్నాయనుకో...
టింకు: ఆ సమయంలో నేను ఇంట్లో ఉన్నానా టీచర్‌.

టీచర్‌: ఆఁ.. ఉన్నావే అనుకో..
టింకు: అయితే అప్పుడిక మా ఇంట్లో నాలుగు యాపిల్స్‌ ఉండే ప్రసక్తే లేదు టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

బామ్మ చెప్పిందని..!

టీచర్‌: ఏంటి వర్షిత్‌ ఈ మధ్య నువ్వు తెగ అల్లరి చేస్తున్నావు. అందరినీ కొడుతున్నావు. హోం వర్క్‌లూ చేయడం లేదు. మొన్నటి వరకు గుడ్‌బాయ్‌లానే ఉన్నావు కదా.. ఇప్పుడేంటి ఇలా తయారయ్యావు?
వర్షిత్‌: మా బామ్మ చెప్పింది టీచర్‌.

టీచర్‌: మీ బామ్మ చెప్పిందా.. ఏం చెప్పింది వర్షిత్‌?
వర్షిత్‌: ఈ లోకంలో మంచివాళ్లకే అన్ని కష్టాలు వస్తాయి.. అని బామ్మ, మా అమ్మతో చెప్పింది. నాకు కష్టాలంటే ఇష్టం లేదు టీచర్‌. అవి నాకు రాకుండా ఉండాలంటే నేను గుడ్‌బాయ్‌గా ఉండొద్దు కదా.. అందుకే ఇలా చేస్తున్నా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

అదన్నమాట అసలు సంగతి!

పావని: మా కోడి ‘భౌ.. భౌ’ అంటుంది తెలుసా?
శ్రావణి: వావ్‌.. అవునా.. నిజమా! అదెలా?

పావని: మా కుక్కకు నేను కోడి అని పేరు పెట్టా మరి.
శ్రావణి: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని