Updated : 01 Jul 2022 07:07 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటుతో అట్లుంటది!

నాన్న: చింటూ.. ఆ పక్కింటి కిట్టూను చూడు.. నీకంటే ఎలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడో.. నువ్వూ ఉన్నావు!
చింటు: ఆ కిట్టూతో ఆడుకోవడం వల్లే నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి నాన్నా..

సమయం లేదు మరి..

టీచర్‌ : తరుణ్‌.. హోంవర్క్‌ ఎందుకు చేయడం లేదు నువ్వసలు?
తరుణ్‌: చేద్దామని బ్యాగ్‌ తీయగానే కరెంట్‌ పోయింది టీచర్‌.. కాసేపటికే వచ్చినా.. ఈలోగా టీవీలో నేను రోజూ చూసే బొమ్మల ప్రోగ్రాం స్టార్ట్‌ అయ్యింది.. 

టీచర్‌ : ఆఁ!!

తిరిగిచ్చేస్తాలే!

నాన్న: టింకూ.. నా చొక్కా జేబులో డబ్బులు నువ్వు తీశావా?
టింకు: అవును తీశాను నాన్నా..

నాన్న: చెప్పకుండా తీయడం తప్పు కదా!
టింకు: అదేంటి.. మీ జేబులో పెట్టిన లెటర్‌ చూడలేదా?

నాన్న: ఏ లెటర్‌?
టింకు: అందులో స్పష్టంగా రాశాను కదా... ‘నాన్నా.. మీ జేబులోంచి డబ్బులు తీసుకుంటున్నా. నేను పెద్దయ్యాక మీవి మీకు తిరిగిచ్చేస్తా’ అని!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని