డాక్టర్‌ అంకుల్‌.. డాక్టర్‌ అంకుల్‌!

నేస్తాలూ...! మనకు హాస్పిటల్స్‌ అన్నా.. ఇంజెక్షన్స్‌ అన్నా, టాబ్లెట్స్‌ అన్నా.. చాలా భయం కదూ! అనారోగ్యం బారినపడ్డప్పుడు ఇవేవీ లేకుండా మనం అంత సులభంగా భయటపడలేం. కానీ, మనకు

Published : 24 Jul 2022 00:18 IST

నేస్తాలూ...! మనకు హాస్పిటల్స్‌ అన్నా.. ఇంజెక్షన్స్‌ అన్నా, టాబ్లెట్స్‌ అన్నా.. చాలా భయం కదూ! అనారోగ్యం బారినపడ్డప్పుడు ఇవేవీ లేకుండా మనం అంత సులభంగా భయటపడలేం. కానీ, మనకు మాత్రం ఆసుపత్రులంటే భయం. మనలాంటి పిల్లల్లో ఆ బెరుకును పోగొట్టడానికి ఓ ప్రయత్నం జరిగింది. అదేంటో,  ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి!

మంగళూరులోని అశోక్‌నగర్‌కు చెందిన ఎస్‌డీఎస్‌ స్కూల్‌ వాళ్లు తమ పాఠశాలలోని పిల్లలకు ఆసుపత్రులు, అక్కడి సౌకర్యాల మీద అవగాహన కల్పిద్దామనుకున్నారు. ఊరికే చెప్పి వదిలేస్తేనో, ఏ వీడియోలోనో చూపిస్తేనో సరిగా అర్థం కాదనుకున్నారు. అందుకే వైద్యుల్నే నేరుగా తమ పాఠశాలకు ఆహ్వానించారు.

ఒక్కొక్కరికి.. ఒక్కో టెడ్డీ...!
ప్రతి విద్యార్థి చేతికి ఒక్కో టెడ్డీ ఇచ్చారు. ఆ టెడ్డీబేర్‌కు ఆ విద్యార్థే తల్లి, తండ్రి. ఇప్పుడు వాళ్లు తమ టెడ్డీలకు వైద్యులతో చికిత్స చేయించాలి. డాక్టర్‌కు ఆ సమస్యను వివరించాలి. టెడ్డీకి సరైన వైద్యం అందేలా చేయాలి.

చాలా ఓపిగ్గా...
వైద్యులు కూడా చాలా ఓపిగ్గా పిల్లలకు సహకరించారు. టెంపరేచర్‌, బీపీ ఎలా చెక్‌ చేయాలి. ఏ విధంగా వైద్యం అందించాలి. మందులు ఎలా వేయాలి. అంబులెన్స్‌ నుంచి పేషెంట్‌ను ఆసుపత్రి లోపలకు ఎలా తీసుకురావాలి. ఇలాంటి వివరాలన్నీ చాలా ఓపిగ్గా చెప్పారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా చెప్పారు. మొత్తానికి ఈ అవగాహన కార్యక్రమం తమకు బాగా ఉపయోగపడిందని, ఆసుపత్రుల మీద అవగాహన కలిగిందంటున్నారు విద్యార్థులు. ముఖ్యంగా ఇప్పుడు తమకు హాస్పిటల్స్‌ అంటే ఏ మాత్రం భయం లేదంటున్నారు ఆ పిల్లలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని