వెదురంటే నాకిష్టం!
నాకు వెదురంటే ఇష్టం.. కానీ నేను పాండాను కాదు. నాకు పొడవైన తోక ఉంటుంది కానీ నేను కోతిని కాదు. నేను అత్యంత అరుదైన జీవిని. ఇంతకీ నా పేరేంటో, నేను ఎక్కడుంటానో చెప్పుకోండి చూద్దాం! తెలియదా.. ఫర్లేదు ఫ్రెండ్స్.. నా గురించి చెప్పుకోవడానికే నేను ఇలా వచ్చాను. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.
నా పేరు గ్రేటర్ బ్యాంబూ లేమర్. నేను ఎక్కువగా వెదురు మొలకలు, ఆకులు, కొమ్మలు తిని బతుకుతాను. మడగాస్కర్‌లో మాత్రమే కనిపిస్తాను. నేను పొడవైన తోకతో కాస్త చూడ్డానికి కోతిలా ఉంటాను. చక్కగా చెట్లు ఎక్కగలను. నేను వాటిమీదే ఎక్కువగా కాలం గడుపుతాను.
ముందు కాళ్ల కన్నా..
నేను దాదాపు 46 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. బరువేమో దాదాపు 2.3 కిలోల వరకు తూగుతాను. నా ముందు కాళ్ల కన్నా, వెనక కాళ్లే పొడవుగా, బలంగా ఉంటాయి. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకడానికి ఇవి ఉపయోగపడతాయి. తోక కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి తోడ్పడుతుంది.
అత్యంత అరుదు..
మా గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. కారణం ఏంటంటే.. మేం కేవలం మడగాస్కర్‌లోనే జీవిస్తాం. మా సంఖ్య కూడా చాలా తక్కువ. ప్రపంచం మొత్తం మీద మా గ్రేటర్ బ్యాంబూ లేమూర్లు సుమారు 100 నుంచి 160 వరకు మాత్రమే జీవించి ఉన్నాయని అంచనా.
వేటాడేస్తాయి..
మేం కనబడితే చాలు ఫోసా (పిల్లిలాంటి జీవి), బుష్ పిగ్స్ మమ్మల్ని కరకరలాడించేస్తాయి. డేగలు, గద్దలు కూడా చంపేస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకుంటూ.. మమ్మల్ని మేం కాపాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మేం నిద్రపోయినప్పుడే శత్రువుల చేతికి తేలిగ్గా చిక్కుతాం. అందుకే మేం చెట్టు తొర్రల్లో ఎక్కువగా నిద్రపోతుంటాం. మా ప్రాణాల్ని మేం కాపాడుకోవడానికే ఈ ఏర్పాటన్నమాట.
గుంపులు.. గుంపులుగా..
మేం గుంపులు గుంపులుగా జీవిస్తాం. మా పిలుపులూ ప్రత్యేకంగా ఉంటాయి. మేం దాదాపు ఏడు రకాల శబ్దాల ద్వారా మాట్లాడుకుంటాం. ఇంతకీ మేం ఎంతకాలం బతుకుతామో చెప్పనేలేదు కదూ! దాదాపు 17 సంవత్సరాల వరకు జీవిస్తాం. నేను వెదురుతోపాటు ఇతర మొక్కల పువ్వులు, గడ్డిని తింటుంటాను. గ్లోబల్ వార్మింగ్, ఇష్టారీతిన అడవుల్ని నరకడం, వేట వల్ల మా సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటామరి. బై.. బై..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో రూ.12,800 కోట్లు: అశ్విని వైష్ణవ్
-
General News
Andhra News: కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు
-
India News
RVM: 2024 ఎన్నికల్లో ఆర్వీఎంల వినియోగంపై కేంద్రం క్లారిటీ
-
Movies News
Thalapathy 67: ఊహించని టైటిల్‌తో వచ్చిన విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబో
-
General News
Viveka murder case: సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ
-
World News
Pakistan: పతనం అంచున పాక్.. 18 రోజులకే విదేశీ మారకపు నిల్వలు!