ఉడుతా.. ఉడుతా.. ఊచ్! భలే దాచావోచ్!
చిన్ని చిన్ని కళ్లు.. చిట్టి నోరు... గుబురైన తోక... బుజ్జి బుజ్జి కాళ్లు... వీపు మీద మూడు గీతలు.. నేస్తాలూ... మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇది ఉడుతల గురించి అని.. వీటికి సంబంధించిన ఓ కొత్త విషయం తాజాగా వెలుగుచూసింది. అదేంటంటే... అబ్బ.. ఆశ.. దోశ.. అప్పడం.. వడ.. అన్నీ ఇక్కడే చెప్పేస్తే ఎలా?... ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.
సాధారణంగా ఉడుతలకు ముందుచూపు ఎక్కువ. అందుకే ఇవి తమకు ఆహారం దొరికినప్పుడే తినాల్సినంత తిని, మిగతా ఆహారాన్ని దాచిపెడుతుంటాయి. ఎక్కువగా ఆకుల చెత్తలో, చెట్టు తొర్రల్లో, నేలకు రంధ్రాలు చేసి కూడా ఇవి గింజలను దాస్తున్నాయి. వీటికి మతిమరుపు అనుకోండి.. అది వేరే విషయం. ఈ కారణం వల్లనే పచ్చదనమూ పెంపొందుతోంది. అయితే తాజాగా చైనాలోని ఓ రెండు రకాల ఉడుతలు మాత్రం సేకరించిన గింజలను మరో రకంగా భద్రపరుస్తున్నాయి.
కొమ్మల్లో దాచి...
చైనాలోని హైనాన్ ద్వీపంలోని ఉష్ణమండల వర్షారణ్యాల్లో నివసించే ఓ రెండు జాతుల ఎగిరే ఉడుతలు మాత్రం చెట్ల కొమ్మల్లో గింజలను దాస్తున్నాయి. అవి పడిపోకుండా తమ పళ్లతో చెక్కి మరీ వాటిని కొమ్మల్లో పట్టుకుని ఉండేలా చేస్తున్నాయి. ఆ గింజలను కూడా కొమ్మల పరిమాణాలకు అనుగుణంగా చెక్కుతున్నాయి. ఉడుతల్లో ఈ పరిజ్ఞానం ఉండటం నిజంగా పరిశోధకులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తేమ నుంచి రక్షణ కోసమే..
మరి ఈ రెండు జాతుల ఉడుతలు మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నాయో తెలుసా? ఉష్ణమండల వర్షారణ్యాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తాము దాచుకున్న గింజలు ఫంగస్ బారిన పడకుండా ఉండటం కోసం ఇలా చేస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రవేత్తల పరిశీలనలో ఇలా మొత్తం 151 గింజలు దొరికాయి. వీటిని పరిశీలించిన వారు ఇవన్నీ కొన్ని ప్రత్యేక కొలతల్లో చెక్కి చెట్ల కొమ్మల్లో అమర్చినట్లు గుర్తించారు. ఉడుతల తెలివైన పనితీరుకు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
నష్టం కలిగించకుండానే..
ఇలా ఉడుతలు గింజలను చెక్కినప్పుడు వాటికి ఏ విధమైన నష్టమూ జరగలేదు. ఈ విత్తనాలు తిరిగి మొలకెత్తే స్థితిలోనే ఉన్నాయి. కేవలం కొన్ని మిల్లీమీటర్ల లోతు వరకే ఉడుతలు గింజల పై పొరను చెక్కాయి. అంటే పచ్చదనాన్ని పరిరక్షించడంలో తమ పాత్రను ఉడుతలు చెక్కుచెదరకుండా అలానే కాపాడుతున్నాయన్నమాట. అలాగే ఈ ఉడుతలు ఈ గింజలను అవే చెట్ల దగ్గర కాకుండా కాస్త దూరంగా ఉన్న వేరే జాతి చెట్ల కొమ్మల్లో దాచుకున్నాయి. ఇతర జీవులు వీటిని చోరీ చేయకుండా ఉండటం కోసమే అవి ఇలా చేస్తున్నాయి. ఆ రెండు జాతుల ఉడుతలు ఒకదాన్ని చూసి మరోటి ఈ పద్ధతిని నేర్చుకుని ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నేస్తాలూ.. ఎంతైనా ఉడుతల తెలివి అమోఘం కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?