రేవులో లేని ఓడరేవు!

కొండలపై కొటలుండటం చూశాం..తోటలుండటం చూశాం.. ఎక్కడైనా ఓడరేవులుండటం చూశామా? అలాంటిదే ఓ దగ్గరుంది... దాని విశేషాలే ఇవి!  ఓ చోట సముద్రంలో అంతెత్తున, నిట్టనిలువుగా ఓ కొండుంది... దాని మీద ఏ గుడో, బడో ఉందనుకుంటున్నారేమో..? అక్కడున్నది అచ్చంగా ఓడరేవు మరి!...

Published : 27 Jun 2019 00:49 IST

కొండలపై కొటలుండటం చూశాం..తోటలుండటం చూశాం.. 
ఎక్కడైనా ఓడరేవులుండటం చూశామా? 
అలాంటిదే ఓ దగ్గరుంది... దాని విశేషాలే ఇవి! 

 చోట సముద్రంలో అంతెత్తున, నిట్టనిలువుగా ఓ కొండుంది... దాని మీద ఏ గుడో, బడో ఉందనుకుంటున్నారేమో..? అక్కడున్నది అచ్చంగా ఓడరేవు మరి! 
ఇంతకీ ఈ చిత్రమైన కొండ హార్బర్‌ ఎక్కడుందంటే... మధ్యధరా సముద్రంలో. అక్కడ సార్డీనియా అనే ఓ ద్వీపంలో. ఈ ద్వీపమేమో ఇటలీ దేశంలోది. 
ఈ సముద్రంలో ఉన్న అతి పెద్ద ద్వీపాల్లో ఈ సార్డీనియా రెండోది. ఇక్కడున్న కొండ మీదే ఈ గమ్మత్తయిన పోర్టుంది. 
ఓడరేవంటే సముద్రం ఉండాలి. ఓడలు ఆగేందుకు వీలయ్యేలా నీటి ఉద్ధృతి ఉండాలి. సరకులు ఓడల్లో వెయ్యడానికీ, దించడానికీ బోలెడు స్థలమూ ఉండాలి. కానీ ఇవేం లేకుండానే ఈ కొండ మీద పోర్టుండటం చిత్రమే కదా. 
దీని పేరు పోర్టో ఫ్లవియా. ఈ హార్బర్‌ని ఇలా కట్టిన ఇంజినీర్‌ కెస్రే వెసెల్లీ.. వాళ్ల కూతురు పేరునే దీనికి పెట్టారు. 
దీన్ని ఎప్పుడు నిర్మించారో చెప్పలేదు కదూ 1924లో. 
ఇంతెత్తున ఎందుకు నిర్మించాల్సొచ్చిందబ్బా దీన్నీ? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. మరేమో ఈ కొండల లోపల మైనింగ్‌ జరుగుతుండేది. అక్కడి నుంచి తవ్విన ఖనిజాల్ని రవాణా చేసేందుకే అక్కడే దీన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 
ఈ కొండ లోపల నుంచి రెండు 
సొరంగాలు పోర్టు ఉన్న ప్రాంతం వరకూ ఉంటాయి. అక్కడ తవ్విన ఖనిజాలు ఆ సొరంగంలోని రైలు ద్వారా వచ్చి అక్కడికి చేరతాయి. పెద్ద ఇనుప క్రెయినులాంటిది ఆ ఖనిజాల్ని ఒక్కసారి ఎత్తి కింద సముద్రంలో ఆగి ఉన్న ఓడలోకి గుమ్మరిస్తుంది. దీంతో ఇక్కడ రవాణా చాలా సులువైపోయింది. మైనింగ్‌ పనులు పూర్తయిపోయాయి. 
దీంతో ఇదిప్పుడు ఓ పర్యటక ప్రాంతంగా మారిపోయింది. సముద్రంలో బోట్లపై వచ్చి ఈ గనుల్ని, రవాణా విధానాన్నీ చూస్తూ అంతా ఆనందించేస్తున్నారు. 
బాగుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు