పిట్టలా? పువ్వులా?

రంగు రంగుల పువ్వుల్ని చూస్తుంటాం...ఎన్నో వన్నెల పక్షుల్నీ చూస్తుంటాం...మరి పక్షుల్లాంటి పువ్వుల్ని చూశారా?వాటి సంగతులు విన్నారా?ఆ విశేషాలేంటో చదివేయండి మరి!  ఏంటో ఎండిపోయిన కొమ్మ మీద జంట పక్షులు కొంటెగా చూస్తున్నట్లు ఉన్నాయి కదూ! నిజానికి ఇవి పిట్టలు కావు. అలా కనిపిస్తున్న పువ్వులు. తెలుపు, గులాబీ రంగుల్లో ఉన్న చిన్న పక్షుల్లా కనిపిస్తాయివి....

Published : 19 Feb 2020 01:01 IST

బుల్లి గువ్వా... బుజ్జి పువ్వా!

రంగు రంగుల పువ్వుల్ని చూస్తుంటాం...

ఎన్నో వన్నెల పక్షుల్నీ చూస్తుంటాం...

మరి పక్షుల్లాంటి పువ్వుల్ని చూశారా?

వాటి సంగతులు విన్నారా?

ఆ విశేషాలేంటో చదివేయండి మరి!

ఏంటో ఎండిపోయిన కొమ్మ మీద జంట పక్షులు కొంటెగా చూస్తున్నట్లు ఉన్నాయి కదూ! నిజానికి ఇవి పిట్టలు కావు. అలా కనిపిస్తున్న పువ్వులు. తెలుపు, గులాబీ రంగుల్లో ఉన్న చిన్న పక్షుల్లా కనిపిస్తాయివి. వీటిని మాగ్నోలియా పువ్వులని అంటారు. ఇవి చైనాలోని బీజింగ్‌లో ఎక్కువగా ఉంటాయి.

మీకు తెలుసా?

ఇక్కడున్నవే కాదు... డవ్‌ ఆర్కిడ్‌, డక్‌ ఆర్కిడ్‌ వంటివీ ఆకట్టుకునే రూపాల్లో ఉంటాయి.

పక్షుల్లాంటి ఈ పూల మొక్కలన్నీ ఆర్కిడ్‌ మొక్కలే.

పుష్పించే మొక్కల్లో ముఖ్యమైంది ఈ ఆర్కిడ్‌.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 వేల రకాల ఆర్కిడ్స్‌ ఉన్నాయి.

రంగుల చిలక!

క్కడున్న ఫొటో చూసి ‘ఎర్రగా తెల్లగా గులాబీ రంగుల్లో భలేగా ఉందే ఎగిరే ఈ బుల్లి చిలుక’ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది నిజమైన చిలుక కాదు. అచ్చు అలాగే ఉండే ఓ పువ్వు. అవును వీటిని ప్యారట్‌ ఫ్లవర్‌, ప్యారట్‌ బాల్సం అని పిలుస్తారు. ఇవి చాలా అరుదైన పూలు. థాయ్‌లాండ్‌, మయన్మార్‌ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. మన దేశంలోనూ మణిపూర్‌ రాష్ట్రంలో కనిపిస్తాయి.

పక్షుల గుంపు!

చ్చపచ్చని రంగులో కనువిందుచేస్తున్న బుల్లి పక్షులన్నీ ఒకే కొమ్మపై చేరినట్టున్నాయే అనిపిస్తోంది కదూ. కానీ ఇవి పక్షులు కాదు వాటిని పోలిన బుల్లి పువ్వులే. చూడ్డానికి ఆకుపచ్చని హమ్మింగ్‌ బర్డ్స్‌లా భలేగా ఉన్నాయి కదా! వీటి పేర్లు గ్రీన్‌ బర్డ్‌ ఫ్లవర్‌, రీగల్‌ బర్డ్‌ ఫ్లవర్‌. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఈ పూల మొక్కలకి నీరు అంతగా అవసరం ఉండదు. అందుకే సముద్ర తీరప్రాంతాల్లో ఇసుక దిబ్బల్లో పెరుగుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని