చిటికెలో చక్కని టెడ్డీబేర్‌!

టెడ్డీబేర్‌ బొమ్మ భలే ముద్దుగా ఉంటుంది కదూ! మరి మనం ఇంట్లోనే చిటికెలో ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామా. దీనికోసం ఓ డస్టర్‌, అయిదు రబ్బరు బ్యాండ్లు, కొంచెం జిగురు, ఓ రంగు దారం, టెడ్డీబేర్‌కు అతికించడానికి పాత బొమ్మల నుంచి సేకరించిన కళ్లు తీసుకోండి. ఓ వేళ లేకపోయినా ఫర్వాలేదు. పెన్నుతోనూ గీసుకోవచ్చు. కాగితాన్ని గుండ్రంగా కత్తిరించుకుని...

Published : 22 Mar 2020 00:24 IST

చూడండి..చెయ్యండి

టెడ్డీబేర్‌ బొమ్మ భలే ముద్దుగా ఉంటుంది కదూ! మరి మనం ఇంట్లోనే చిటికెలో ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందామా. దీనికోసం ఓ డస్టర్‌, అయిదు రబ్బరు బ్యాండ్లు, కొంచెం జిగురు, ఓ రంగు దారం, టెడ్డీబేర్‌కు అతికించడానికి పాత బొమ్మల నుంచి సేకరించిన కళ్లు తీసుకోండి. ఓ వేళ లేకపోయినా ఫర్వాలేదు. పెన్నుతోనూ గీసుకోవచ్చు. కాగితాన్ని గుండ్రంగా కత్తిరించుకుని.. దాని మీద టెడ్డీబేర్‌ ముక్కు, నోరు గీసి సిద్ధంగా పెట్టుకోండి.  
 

* ఇప్పుడు డస్టర్‌ నాలుగు మూలలకూ చిత్రంలో చూపించినట్లు రబ్బరు బ్యాండ్లు వేయండి.
*  ఇవి మనం తయారు చేయబోయే టెడ్డీబేర్‌కు చెవులు, కాళ్లన్నమాట.
*  మరో రబ్బరు బ్యాండ్‌ను తీసుకుని డస్టరు మధ్యలో వేయండి.
*  పై భాగం తల.. కిందభాగం పొట్టలా కనిపించేలా చేయండి.
*  ఇప్పుడు మధ్యలో వేసిన రబ్బరుపై చిత్రంలో చూపించినట్లు ఓ రంగు దారం చుట్టి ముడివేయండి.
*  పాత బొమ్మ నుంచి తీసి పెట్టుకున్న కళ్లను దీనికి అతికించండి.
*  తర్వాత గుండ్రంగా కత్తిరించి పెట్టుకున్న కాగితాన్నీ అతికించండి.
*  ఇంకేం చక్కని టెడ్డీబేర్‌ సిద్ధం. ఇలాంటివి మరికొన్ని చేసుకుని ఎంచక్కా షోకేస్‌లో పెట్టుకుంటే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని