ఖాళీ చేతిలో నాణెం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీకు మ్యాజిక్‌ ద్వారా.. గాల్లో నాణేలు సృష్టించడం వచ్చా! ‘రాదు.. వస్తే బాగుండు! ఎంచక్కా.. ఎన్నంటే అన్ని కాయిన్స్‌ మన చేతుల్లోకి తెచ్చుకోవచ్ఛు బోలెడన్ని ఐస్‌క్రీంలు, చాక్లెట్లు కొనుక్కొని తినొచ్చు!’ అనుకుంటున్నారేమో? కానీ నిజంగా గాల్లో నుంచి మన చేతుల్లోకి కాయిన్లు రావు.

Updated : 29 Apr 2020 02:41 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీకు మ్యాజిక్‌ ద్వారా.. గాల్లో నాణేలు సృష్టించడం వచ్చా! ‘రాదు.. వస్తే బాగుండు! ఎంచక్కా.. ఎన్నంటే అన్ని కాయిన్స్‌ మన చేతుల్లోకి తెచ్చుకోవచ్ఛు బోలెడన్ని ఐస్‌క్రీంలు, చాక్లెట్లు కొనుక్కొని తినొచ్చు!’ అనుకుంటున్నారేమో? కానీ నిజంగా గాల్లో నుంచి మన చేతుల్లోకి కాయిన్లు రావు. కానీ ఓ చిన్న ట్రిక్‌తో.. చూసేవారికి అలాంటి భ్రమ కలిగేలా చేయొచ్ఛు మరి ఎలాగో నేర్చుకుందామా!

* మీరు మీ స్నేహితులకు రెండు చేతుల్ని చూపించండి.

* రెండూ ఖాళీగానే ఉంటాయి.

* కాసేపటికి కుడి చేతిని అటూ ఇటూ తిప్పుతూ...‘వన్‌... టూ... త్రీ..’ అనండి.

* మీ చేతుల్లోంచి ఒక నాణెం (కాయిన్‌) బయటకు వస్తుంది.

* ‘అరె.. ఎలా వస్తుంది. అలా రావాలంటే ఎలా?’ అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు ఈ చిన్న కిటుకు తెలిస్తే చాలు.. ఎంచక్కా మీరు చేసేయొచ్ఛు

కిటుకు:

* ఈ మ్యాజిక్‌ చేయడానికి ముందే నాణెం తీసుకుని ఎడమచేతి రెండు వేళ్ల మధ్య వెనక వైపు ఉంచుకోవాలి.

* ఈ పని చాలా జాగ్రత్తగా చేయాలి.

* ఈ నాణెం ముందున్న వాళ్లకు కనిపించదు.

* తర్వాత కుడి చేతిని అటు ఇటూ తిప్పుతూ.. ఎడమచేతి వేళ్ల మధ్య వెనకవైపు ఉన్న కాయిన్‌ను కుడి చేత్తో తీసుకోవాలి.

* ఇంకేం ఇప్పుడు చేతిలో ప్రత్యక్షమైన నాణెం చూపించాలి.

* కాయిన్‌ ఎలా వచ్చిందో అర్థం కాక మీ స్నేహితులంతా ఆశ్చర్యపోతారు.

* ఈ మ్యాజిక్‌ రావాలంటే చేతులు వేగంగా.. అవతల వారు అర్థం చేసుకోలేనంత చకచకా తిప్పడం రావాలి. దీనికి ప్రాక్టీస్‌ చాలా అవసరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని