ఇది కృత్రిమ దీవి!

దీవులు.. అదే ఐలాండ్స్‌ అనగానే గుర్తొచ్చేవి మన దగ్గర అండమాన్‌ నికోబార్‌.. విదేశాల్లో మాల్దీవులు. అంతే కదా? ప్రస్తుతం మాల్దీవులు పర్యావరణ కాలుష్యంతో అనేక సమస్యలు

Published : 10 Oct 2020 07:03 IST

దీవులు.. అదే ఐలాండ్స్‌ అనగానే గుర్తొచ్చేవి మన దగ్గర అండమాన్‌ నికోబార్‌.. విదేశాల్లో మాల్దీవులు. అంతే కదా? ప్రస్తుతం మాల్దీవులు పర్యావరణ కాలుష్యంతో అనేక సమస్యలు ఎదుర్కొంటోందంట. దీనికి పరిష్కారంగా అక్కడ కృత్రిమ దీవులను సృష్టిస్తున్నారు.
హిందూ మహాసముద్రంలో ఉన్నట్లు కనిపించే మాల్దీవులు దాదాపు 1,200 దీవుల సమూహం. వాటిలో దాదాపు 80 శాతం సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండటం, పర్యావరణ కాలుష్యంతో తరచూ ముంపునకు గురవుతున్నాయి. ఆ ముప్పు తప్పించుకునేందుకు గతంలో అక్కడ హులుమాలే అనే ద్వీపాన్ని నిర్మించారు. ఇటీవల అందులో ‘ది సిటీ ఆఫ్‌ హోప్‌’ పేరిట ఆధునిక నగరానికి బాటలు వేశారు. సముద్రం నుంచి తీసిన ఇసుకను మట్టానికి రెండు మీటర్ల ఎత్తులో పరుస్తూ కృత్రిమ ద్వీప నిర్మాణం చేపట్టారు.  
పర్యావరణానికి అనుకూలంగా..
ఏసీల వినియోగం తగ్గించేలా నగరంలోని వీధులను గాలి వీచే దిశలో నిర్మిస్తున్నారు.   సొంత వాహనాల వినియోగం తగ్గించేలా స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, పార్కులను నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉండేలా తీర్చిదిద్దారు. ఎలక్ట్రిక్‌ బస్సులు, సైకిళ్లకు ప్రత్యేక లేన్లు ఉన్నాయంట. జల సంరక్షణ పద్ధతులు కూడా అవలంభిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని