లైకా.. అనే నేను!
హాయ్.. నా పేరు లైకా. నేనో కుక్కను. మామూలు కుక్కనైతే కాను. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటిప్రాణిని నేనే. నా గురించి తెలుసుకోవాలని ఉందా?!
అది 1957 నవంబరు 3. ఆ రోజే నేను అంతరిక్షంలోకి వెళ్లాను. అంటే నేను నేనుగా వెళ్లలేదు అనుకోండి. మీరే పంపారు! అదేనండి.. రష్యన్లు స్పుత్నిక్-2 అనే అంతరిక్ష నౌకలో పంపారు. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకొన్ని విశేషాలు చెబుదామనే ఇలా వచ్చాను.
నేనో వీధి కుక్కను!
రష్యన్ శాస్త్రవేత్తలు నాతోపాటు మరికొన్ని కుక్కలకూ అంతరిక్ష వాతావరణంలో ఎలా ఉండాలో శిక్షణ ఇచ్చారు. అందులో నేను పాసయ్యాను కాబట్టే నన్ను అంతరిక్షంలోకి పంపారు. నిజానికి నేను ఓ వీధికుక్కను. నా అసలు పేరు కుద్రావుకా. నేను గట్టిగా అరుస్తున్నా అని నాకు లైకా అని పేరు పెట్టారు. రష్యన్ భాషలో లైకా అంటే గట్టిగా అరవడం అని అర్థం. ఈ శాస్త్రవేత్తలు అంత పెద్ద ప్రాజెక్టుకు వీధికుక్కనైన నన్ను ఎందుకు ఎంపిక చేశారు..? అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే.. నేను తీవ్రమైన చలి, ఆకలిని తట్టుకోగలను. పాపం పెంపుడు కుక్కలు నాలా కఠిన పరిస్థితులను ఎదుర్కోలేవు. అందుకే ఆ గౌరవం నాకు దక్కిందన్నమాట.
చాలా తతంగం..
అంతరిక్షంలోకి పంపడం అంటే అనుకున్నంత తేలిక కాదు. దానికి చాలా తతంగం ఉంటుంది. నాకు కొన్ని రోజుల ముందునుంచే శిక్షణ ఇచ్చారు. చిన్న పంజరంలాంటి నిర్మాణంలో రోజుల తరబడి ఉండాలి. ఎందుకంటే నన్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లే స్పుత్నిక్-2లో అంతే స్థలం ఉంటుంది మరి! అన్నట్లు నేను అసలు విషయం చెప్పడం మరిచిపోయాను. మగకుక్కలు ఆడవాటికంటే ఆకారంలో పెద్దగా ఉంటాయి కదా..! అందుకే ఆడ కుక్కనైన నన్ను శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి ఎంపిక చేశారు. నేను అప్పుడు అయిదు కిలోల బరువున్నానంతే. వయసేమో.. మూడు సంవత్సరాలు. నాకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకంగా జెల్‌రూపంలోనే ఉండేది. అంతరిక్షంలో కూడా ఇదే ఆహారం తినాల్సి ఉంటుంది. అందుకే నాకు ఇలా అలవాటు చేశారు.
మూడు రోజుల ముందు నుంచే..
స్పుత్నిక్-2ను ప్రయోగించడానికి మూడు రోజులు ముందునుంచే నన్ను దానిలో ఉంచారు. వారానికి సరిపడా జెల్ రూపంలోని ఆహారం, ఆక్సిజన్ అందులో ఏర్పాటు చేశారు. అంతకు కొన్నిరోజుల ముందే ఆపరేషన్ చేసి నా శరీరంలో కొన్ని పరికరాలు అమర్చారులెండి. వాటి సాయంతో నా గుండె పనితీరు, ఊపిరి తీసుకునే విధానం, రక్తపీడనంలాంటివి చూసేవారు. అలా నవంబరు 3 రానే వచ్చింది. రాకెట్ నిప్పులు కక్కుతూ రివ్వున పైకి ఎగిసింది. నాకు ఆ శబ్దానికి ఎంత భయం వేసిందో.. మాములు కన్నా కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో నా గుండె కొట్టుకుంది. గాలి పీల్చుకునే వేగం కూడా పెరిగింది. తర్వాత.. కొన్ని గంటల్లోనే నేను వేడికి తట్టుకోలేక చనిపోయాను. కానీ రష్యన్లు మాత్రం నేను కొన్ని రోజులు బతికాను అని.. చివరికి ఆక్సిజన్ సరిపోక చనిపోయాను అని అబద్ధం చెప్పారు. శీతలీకరణ వ్యవస్థ (కూలింగ్ సిస్టమ్) విఫలం కావడం వల్ల వేడికి తట్టుకోలేక నేను ప్రాణాలు విడిచినట్లు 2002లో అసలు నిజం బయటపడింది. అయినా నన్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేటప్పుడే అందరికీ తెలుసు నేను భూమి మీదకు మళ్లీ తిరిగి రాను అని! ఎందుకంటే.. అప్పట్లో ఇప్పటిలా శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధి చెందలేదు కదా!..
‘అమ్మా.. లైకా.. అమ్మా.. లైకా’ అని టింకూ పే..ద్దగా అరవడంతో ‘ఏమైంది టింకూ.. కలగానీ కన్నావా.. ఏంటి?’ అనుకుంటూ వాళ్ల అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుని ఊరడించింది. తనకు వచ్చిన కల గురించి.. లైకా తనతో చెప్పిన విషయాల గురించి టింకు వాళ్ల అమ్మతో చెప్పాడు. ‘ఓ.. అదా.. టింకూ.. నిన్న నీతో తాతయ్య లైకా గురించి చెప్పారు కదా.. అదే ఊహిస్తూ.. పడుకున్నావేమో! కలగా వచ్చి ఉంటుందిలే. తొందరగా రెడీ అవ్వు.. స్కూలుకు టైం అవుతోంది..’ అంది వాళ్ల అమ్మ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!