ఆకాశమంత ఎత్తు...అక్కడో అందాల సరస్సు!

సముద్ర మట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తు అంటే.. దాదాపు మేఘాలను తాకేంత ఎత్తు! అంత ఎగువన ఓ సరస్సు ఉంది. కానీ దాని గురించి బయటి ప్రపంచానికి కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసింది. ఇంతకీ అది ఎక్కడ ఉంది. దాని విశేషాలేంటో తెలుసుకుందామా!

Published : 23 Feb 2021 00:44 IST

సముద్ర మట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తు అంటే.. దాదాపు మేఘాలను తాకేంత ఎత్తు! అంత ఎగువన ఓ సరస్సు ఉంది. కానీ దాని గురించి బయటి ప్రపంచానికి కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసింది. ఇంతకీ అది ఎక్కడ ఉంది. దాని విశేషాలేంటో తెలుసుకుందామా!
కజన్‌సారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు. నేపాల్‌లోని మనాంగ్‌ జిల్లాలో సముద్రమట్టానికి సుమారు 5,020 మీటర్ల ఎత్తులో దాదాపు 1,500 మీటర్ల పొడవు, 600 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. దీన్ని పర్వతారోహకులు 2019లో గుర్తించారు. అప్పుడే దీని గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇంకేముంది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సుగా రికార్డు కొట్టేసింది. అంతకుముందు వరకు ఈ ఘనత టిలిచో సరస్సుకు ఉండేది. ఇది సముద్రమట్టానికి 4,919 మీటర్ల ఎత్తులో ఉంది. మరో విశేషం ఏంటంటే ఈ సరస్సు కూడా నేపాల్‌లోని మనాంగ్‌లోనే ఉంది. అంటే ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన, రెండో ఎత్తైన సరస్సులు నేపాల్‌లోనే ఉన్నాయన్నమాట.

* చేరుకోవడం సులువు కాదు
ఈ సరస్సును చేరుకోవడం అంత తేలిక కాదు. మూడు బేస్‌క్యాంపులు దాటిన తర్వాతే పర్వతారోహకులు ఇది ఉన్నచోటుకు వెళ్లగలరు. ఇందుకోసం మూడు రోజులు పడుతుంది. అదీ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే.. లేకపోతే అంతే సంగతులు. రోజులకు రోజులు బేస్‌క్యాంప్‌లో చిక్కుకు పోవాల్సిందే. ఇవండీ కజన్‌సారా విషయాలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు